భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో రామభక్తులు కార్తీకమాస శ్రీరామ పునర్వసు దీక్షలు చేపట్టారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కండ్రికగూడెం గ్రామానికి చెందిన సుమారు 2వందల మంది రామభక్తులు కాలి నడకన భద్రాద్రి రామయ్య చెంతకు వచ్చారు. స్వామివారిని దర్శించుకుని శ్రీరామదీక్షలు స్వీకరించారు.