టైలర్ కన్హయ్య తరహాలో కుర్రాడి హత్య..! రైలు పట్టాలపై శవమై తేలిన బీటెక్ విద్యార్ధి

0
770

దేశంలో బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ వ్యాఖ్యలపై వివాదం ఇంకా కొనసాగుతోంది. మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ముస్లిం వర్గం ఇంకా వదలడం లేదు. అలాగే నుపుర్ శర్మకు మద్దతు పలికిన వారిని మతోన్మాదులు అతిదారుణంగా హత్యలు చేస్తున్నారు.

రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్హయ్యలాల్ హత్య దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. నుపుర్ శర్మ పోస్టును షేర్ చేసినందుకు ఇద్దరు ముస్లింలు టైలర్ ను అతి దారుణంగా తలనరికి హత్య చేశారు. అంతకుముందే మహరాష్ట్రలో నుపుర్ శర్మకు మద్దతు పలికినందుకు కెమిస్ట్ ను సన్నిహితులే దారికాచి కత్తులతో దాడి చేసి చంపారు. ఆ తర్వాత బీహార్ లోనూ ఇలాంటి ఘటన వెలుగు చూసింది. నుపుర్ శర్మను సపోర్టు చేసినందుకు ఓ యువకుడిపై కొంతమంది ముస్లింలు కత్తులతో దాడులకు దిగారు. దేశంలో ఇలాంటి ఘటనలు ఇంకా వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లో ఓ బీటెక్ విద్యార్ధి మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. ఎందుకంటే ఆ యువకుడు హిందూ యువకుడు కావడమే దీనికి ఆజ్యం పోస్తోంది. అలాగే యువకుడు అదృశ్యమైనప్పుడు అతని తండ్రికి వచ్చిన మెస్సేజ్ కూడా మరింత అనుమానాలను రేకెత్తిస్తోంది.

మధ్యప్రదేశ్ లో రైలు పట్టాలపై బీటెక్‌ కుర్రాడి మృతదేహం పడి ఉండడం, ఈ ఘటనకు ఉదయ్‌పూర్‌ టైలర్‌ హత్యోదంతంతో ముడిపడి ఉందన్న కుర్రాడి తండ్రి అనుమానాలతో ఒక్కసారిగా కలకలం రేగింది. మధ్యప్రదేశ్‌ సియోని-మాల్వాకు చెందిన నిషాంక్‌ రాథోడ్‌.. రాయ్‌సెన్‌ ఒబయ్‌దుల్లాగంజ్‌ పట్టణంలో హాస్టల్‌లో ఉంటూ బీటెక్‌ మూడో ఏడాది చదువుతున్నాడు. సోదరి ఇంటికి వెళ్తానని చెప్పి హాస్టల్‌ నుంచి శనివారం బయలుదేరాడు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఆమెను కలిసి.. ఆపై తిరిగి హాస్టల్‌కు చేరుకోలేదు. అయితే కాసేపటికే అతని తండ్రికి, ఇతర స్నేహితులు, బంధువులకు అతని ఫోన్‌ నుంచి ఓ బెదిరింపు మెసేజ్‌ వెళ్లింది. దీంతో అప్రమత్తమైన నిషాంక్‌ కుటుంబ సభ్యులు మిస్సింగ్‌ కంప్లయింట్‌ ఇచ్చారు. అయితే ఆ మరుసటి రోజే సమీపంలోని ఓ రైల్వే ట్రాక్‌ మీద శవమై కనిపించాడు నిషాంక్‌. రైలు మీది నుంచి వెళ్లడంతో అతని శరీరం ఛిద్రమైపోయింది. నిషాంక్‌ క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్‌లో డబ్బులు పొగొట్టుకున్నాడు. ఈ తరుణంలో తొలుత ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావించారు.

అయితే నిషాంక్‌ తండ్రి ఉమా శంకర్‌ రాథోడ్‌.. తన కొడుకు ఫోన్‌ నుంచి తన ఫోన్‌కు వచ్చిన సందేశాల్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో అసలు వ్యవహారం మొదలైంది. తల వేరు చేయబడిందని ఆ సందేశంలో ఉంది. అంతేకాదు.. రాథోడ్‌ సార్‌.. మీ అబ్బాయి చాలా ధైర్యశాలి అంటూ ఆ సంభాషణ నడిచింది. దీంతో తన కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదంటున్నాడు. అలాగే గుజ్తఖ్-ఎ-నబీ కి ఏక్ హాయ్ సజా, సార్ తాన్ సే జుడా అనే మాటల్ని ఉదయ్‌పూర్‌ టైలర్‌ కన్హయ్యలాల్‌ హత్య టైంలో హంతకులు ఉపయోగించారు. దీంతో తన కొడుకును చంపేసి ఉంటారని మృతుడి కుటుంబం అనుమానిస్తోంది. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. అదే రోజు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఓ పెట్రోల్‌ బంక్‌ వద్ద ఒంటరిగా కనిపించాడని తెలిపారు. అనేక అనుమానాల నేపథ్యంలో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

మరోవైపు మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల కేంద్రంగా అనేక కుట్రలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు ముస్లిం మతఛాందసవాదులు నుపుర్ శర్మను చంపేస్తామని.. మరికొంత మంది మత ప్రముఖులు నుపుర్ శర్మను చంపేస్తే నజరానాలు ప్రకటించడం వివాదాస్పదం అయింది. ఇప్పటికే వారిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. అలాగే గతవారం నుపుర్ శర్మను చంపేందుకు ఓ పాకిస్తాన్ జాతీయుడు ఏకంగా ఇంటర్నేషనల్ బార్డర్ దాటి పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చాడు. అంతర్జాతీయ సరిహద్దు దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న పాకిస్తాన్ జాతీయుడిని అరెస్ట్ చేశారు. రాజస్థాన్ లోని శ్రీగంగా నగర్ లో పాక్ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సదరు పాకిస్తాన్ వ్యక్తిని ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇతర ఇన్వేెస్టిగేషన్ ఏజెన్సీలు విచారిస్తున్నాయి. అతని దగ్గర నుంచి 11 అంగుళాల కత్తి, మతమరమైన పుస్తకాలు, బట్టలు, ఆహరాన్ని స్వాధీనం చేస్తున్నారు. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ బహౌద్దీన్ నగరానికి చెందిన రిజ్వాన్ అష్రఫ్ గా గుర్తించాయి భద్రతా బలగాలు. ప్రాథమిక విచారణలో నుపుర్ శర్మను చంపేందుకు వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం అజ్మీర్ దర్గాలను సందర్శించాలని నిందితుడు భావించినట్లుగా వెల్లడించారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here