More

    అయ్యన్నపాత్రుడి ఇంటి ప్రహరీ కూల్చివేత

    టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటి ప్రహరీని ఈ తెల్లవారుజామున మునిసిపల్ అధికారులు జేసీబీతో కూల్చివేశారు. ఆయన ఇంటికి వచ్చే అన్ని దారులను మూసేసిన పోలీసులు భారీగా మోహరించారు. ఇంటి ప్రహరీ కూల్చివేతపై అయ్యన్న కుటుంబ సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. మునిసిపల్ అధికారుల నుంచి అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే ప్రహరీ నిర్మించినట్టు అయ్యన్న రెండో కుమారుడు చింతకాయల రాజేష్ తెలిపారు. ల్యాండ్ పర్మిషన్ ఇచ్చిన తర్వాతే గోడను నిర్మించామని.. పోలీసులు ఇంట్లోకి వచ్చి దౌర్జన్యం చేశారని ఆరోపించారు. అధికారులు మాత్రం గోడను ప్రభుత్వ స్థలంలో నిర్మించినందుకే కూల్చేసినట్టు చెబుతున్నారు. మరోవైపు, అయ్యన్నఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆయన కుమారుడు రాజేష్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

    పంట కాల్వ ఆక్రమించి గోడ కట్టారని, ప్రభుత్వ భూమిలోని రెండు సెంట్లు ఆక్రమించారని నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ నోటీసులో పేర్కొన్నారు. గోడ తొలగించడంపై అయ్యన్న కుటుంబసభ్యులు అభ్యంతరం తెలిపారు. మరోవైపు అయ్యన్నను అరెస్ట్ చేస్తారంటూ అయ్యన్న అనుచరుల ఆందోళనకు దిగారు. కొంతమంది టీడీపీ నేతలను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. అయ్యన్న ఇంటి దగ్గర పోలీసులు ఆంక్షలు విధించారు. మీడియాకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. అయ్యన్నపై ఇప్పటికే 12 కేసులు నమోదయ్యాయి. అయ్యన్న ఇంటిని పోలీసులు చుట్టుముట్టడంతో అనకాపల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

    spot_img

    Trending Stories

    Related Stories