Special Stories

బ్లాక్ ఫంగస్‎కు ఆయుర్వేదంతో చెక్

అసలే కరోనాతో బెంబెలెత్తిపోతుంటే.. ఆ రాకాసి పురుగు మరో దరిద్రాన్ని వెంటపెట్టుకొచ్చింది. అదే బ్లాక్ ఫంగస్. కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయిని ఊపిరిపీల్చుకుంటున్న సమయంలో.. పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లోని కోఠి ఈఎన్టీ ఆసుపత్రిలో బ్లాక్ ఫంగస్ బాధితులతో బెడ్లన్నీ నిండిపోయినట్టు వార్తలు వెలువడుతున్నాయి.

ప్రస్తుతం బ్లాక్ ఫంగస్ కు మోడ్రన్ మెడిసిన్ లో అందుబాటులో వున్న ఏకైక ఔషధం ఆంఫోటెరిసన్ – బి. ఇది ఇంజక్షన్ల రూపంలో లభిస్తుంది. కానీ, ఆంఫోటెరిసన్ – బి ఇంజక్షన్ల కొరత వేధిస్తోంది. అత్యంత ఖరీదైన ఈ ఇంజెక్లన్లు దొరకడం కూడా కష్టంగా మారింది. ఖరీదైన ఇంజక్షన్లు కాబట్టి వీటిని డిమాండ్ ను దృష్టిలో వుంచుకుని.. ఫార్మా కంపెనీలు చాలా తక్కువ మొత్తంలో ఉత్పత్తి చేసేవి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని వీటి ఉత్పత్తిని పెంచాలని ఫార్మా కంపెనీలకు సూచించింది. దీంతో ఇప్పుడిప్పుడే ఆంఫోటెరిసన్ – బి ఇంజక్షన్ల స్టాకు పెరుగుతూవుంది. బ్లాక్ ఫంగస్ ను సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, దీనిని గుర్తించడంలో ఆలస్యం చేసినవారికే ముప్పు ఎక్కువగా వుంటుంది.

ఇదిలావుంటే, కొవిడ్ కు ఆనందయ్య మందు రూపంలో ఆయుర్వేద మందు ఉన్నట్టే.. బ్లాక్ ఫంగస్ కు కూడా ఆయుర్వేదంలో చికిత్స వుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ ఫంగస్ వ్యాధిని ఆయుర్వేద వైద్యంతో పూర్తిగా నియంత్రించవచ్చంటున్నారు ఆయుష్ వైద్యులు. కోఠి ఈఎన్‌టీ అసుపత్రిలో ఇప్పటికే ఈ వ్యాధితో చికిత్స పొందుతున్నవారికి ఆయుర్వేద మందులు ఇస్తున్నారు. బ్లాక్ ఫంగస్ బాధితులకు ఆయుర్వేద మందులు అందజేస్తున్నట్టు ఆయుష్ డైరెక్టర్ డాక్టర్ అలుగు వర్షిణి తెలిపారు. ఈ మందుల వల్ల ఎలాంటి దుష్ప్రరిణామాలుండవని.. అల్లోపతి మెడిసిన్ తీసుకుంటున్నాసరే ఇది తీసుకోవచ్చని చెబుతున్నారు. బ్లాక్ ఫంగస్ రాకుండా ముందు జాగ్రత్త చర్యగా కూడా ఈ మందును తీసుకోవచ్చని అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆయుర్వేద మందుల షాపుల్లో ఇది లభ్యమవుతుందని తెలిపారు. ప్రభుత్వం ఈ మందుల్ని ఉచితంగా అందుబాటులో తసుకొచ్చిందని.. త్వరలో ప్రజలు అందించనుందని పేర్కొన్నారు. కరోనా చికిత్సలో స్టెరాయిడ్స్, యాంటీ బయోటిక్స్ వాడకాన్ని తగ్గిస్తే బ్లాక్ ఫంగస్ రాకుండా కాపాడుకోవచ్చన్నారు.

అటు, ఎస్​ఆర్​ నగర్​లోని ప్రభుత్వ ఆయుర్వేద కాలేజీలో బ్లాక్​ ఫంగస్ వ్యాధి నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేపట్టారు. వీటిని క్రమం తప్పకుండా వాడినట్లయితే బ్లాక్​ ఫంగస్​ను ముందుగానే నివారించవచ్చని కాలేజీ అడిషన్ ప్రిన్సిపల్ పెరుగు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. కొవిడ్​ వచ్చిన వారిలో కూడా రాకుండా అరికట్టవచ్చని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ మందులను ప్రతిరోజు స్థానిక ఆయుర్వేద హాస్పిటల్​లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత పంపిణీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

అటు, బ్లాక్‌ ఫంగస్‌ను ఆయుర్వేద మందులతో పూర్తిగా నయం చేయవచ్చని ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద దవాఖాన ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామచంద్రారెడ్డి తెలిపారు. వెంగళరావునగర్‌ డివిజన్‌ పరిధిలోని డాక్టర్‌ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యకళాశాలలోనూ బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు ఉచితంగా ఆయుర్వేద మందులను పంపిణీ చేశారు.

ప్రస్తుతం బ్లాక్ ఫంగస్ రెండు రకాల ఆయుర్వేద చికిత్సలు అందుబాటులో వున్నాయని ఆయుష్ అధికారులు చెబుతున్నారు. వీటిలో మొదటిది.. గంధక రసాయనం, వసంత కుసుమాకర, వ్యోషాది వటి, శుభ్ర భస్మం లతో చేసే చికిత్స కాగా.. రెండవది.. సంశమనవటి, నిశామలవటి, సుదర్శనఘనవటి మందులతో చికిత్స చేస్తారు. వీటిలో ఏ చికిత్సను ఎంచుకున్నా.. డోసుల విషయంలో ఆయుర్వేద వైద్యుల సలహా మేరకు వాడాల్సివుంటుంది.

ఇదిలావుంటే, బ్లాక్ ఫంగస్ కు మరో ఆయుర్వేద వైద్య విధానంపైనా ఇప్పుడు చర్చ జరుగుతోంది. అదే జలగలతో ట్రీట్ మెంట్. బీహార్ రాజధాని పాట్నా రాష్ట్ర ఆయుర్వేద కళాశాలలో విషం లేని జలగల కోసం అన్వేషణ అక్కడి వైద్యులు అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. విషం లేని జలగలతో బాధితులకు చికిత్స చేయవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. జలగ మానవ శరీరం నుంచి చెడు రక్తాన్ని పీలుస్తుంది. చనిపోయిన కణాన్ని నాశనం చేస్తుంది. రక్త ప్రసరణ ఆగి చర్మం క్షీణించినప్పుడు చనిపోయిన కణాలను సక్రియం చేయడానికి జలగ చాలా సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. అందువల్ల వైద్యులు చికిత్స కోసం జలగలను వెతుకుతున్నారు.

సాధారణంగా జలగల్లో రెండు రకాలుంటాయి. విషంతో కూడిన జలగలతో పాటు.. విషం లేని జలగలు కూడా వుంటాయి. వీటిలో విషం లేని జలగలతోనే చికిత్స చేస్తారు. విషంలేని జలగను గుర్తించడం చాలా సులభం. ఇవిమృదువైన చర్మం, జుట్టులేకుండా ఆకుపచ్చగా ఉంటుంది. ఇవి గ్రామీణ ప్రాంతాల్లోనే కనిపిస్తాయి. కానీ, విషంతో ఉన్న జలగలు ముదురు నలుపు రంగులో ఉంటాయి. ఈ చికిత్స కూడా సత్ఫలితాలనిస్తే.. బ్లాక్ ఫంగస్ బాధితులకు ఉపశమనం లభించినట్టే.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

fourteen − four =

Back to top button