More

    దేశ వ్యాప్తంగా ముగిసిన నిధిసేకరణ్ అభియాన్

    అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఇంటింటికి వెళ్లి నిధిసేకరించే అభియాన్ ను శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిలిపివేసింది. అయితే ఆన్ లైన్ ద్వారా భక్తులు విరాళాలు సమర్పించే వచ్చునని ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ జీ తెలిపారు. దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఈ నిధి సేకరణ్ అభియాన్ ద్వారా భక్తులు రూ.2500 కోట్ల నిధులు సమర్పించారు. ఇంకా ఆన్ లైన్ ద్వారా జమ చేసిన నిధులను, చెక్కుల రూపంలో వచ్చిన సొమ్మును లెక్కిస్తే జమ అయిన నిధుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు.

    మందిర నిర్మాణానికి చేప‌ట్టిన నిధి స‌మ‌ర్పణ కార్యక్రమం దేశంలోని న‌లుమూలల్లో ఉన్న  ప్రజ‌ల‌ను ఐక్యం చేసింది.  

    ఆలయం నిర్మాణం కోసం 2021 జనవరి 15 నుండి ఫిబ్రవరి 27 వ‌ర‌కు చేప‌ట్టిన నిధి సేక‌ర‌ణ కార్యక్రమంలో… ప్రపంచంలోనే అత్యంత పెద్ద జ‌న‌జాగ‌ర‌ణ కార్యక్రమంగా నిలిచింది.దేశ వ్యాప్తంగా సుమారు 4ల‌క్షల గ్రామాలలో నిధి స‌మ‌ర్పణ కార్యక్రమం విజ‌య‌వంతగా పూర్తి అయ్యింది. ప‌ల్లెలు, ప‌ట్టణాలు అనే తేడా లేకుండా అన్ని  ప్రాంతాల్లో నిధి స‌మ‌ర్పణ కార్యక్రమంలో భాగంగా  కార్యకర్తలు వెళ్లారు. సుమారుగా 10 కోట్ల కుటుంబాలు   ఈ నిధిసమర్పణ్ అభియాన్ లో పాలు పంచుకున్నాయి. నిధి సేకరణ కోసం వెళ్లిన కార్యకర్తలకు ఈ అభియాన్ ఎన్నో అనుభూతులను పంచింది. సమాజంలోని కోటిశ్వరుడిని నుంచి మొదలు పెడితే… పురిపాకలో ఉండే పండు ముదుసలి వరకు అంతా తమకు తోచినంతలో నిధిని సమర్పించి… తమ భక్తిని చాటుకున్నారు.

    ఈ జ‌నజాగ‌ర‌ణ కార్యక్రమంలో మొత్తంగా 1,75,000 జట్లలో సుమారు 9 ల‌క్షల మంది కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి నిధి సేక‌రించారు. సేక‌రించిన మొత్తాలను  24 బ్యాంకుల్లో జమ చేశారు. నిధి సేకరణకు సంబంధించిన రోజు వారి వివరాలను తెలుసుకునేందుకు…దేశవ్యాప్తంగా 49 కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని ప్రధాన కేంద్రంలో ఇద్దరు చార్టర్డ్ అకౌంటెంట్ల నేతృత్వంలోని 23 కార్యకర్తలు బ్యాంక్ అకౌంట్ల ఖాతాలను నిరంతరం పర్యవేక్షించారు. బ్యాంక్ అధికారులతో సంప్రదింపులు జరిపారు. కార్యకర్తల మధ్య నిరంతరం సంప్రదింపుల కోసం ప్రత్యేక యాప్ ను సైతం రూపొందించడం జరిగింది.

    ఇటు నిధి సేకరణ్ అభియాన్ లో భాగంగా… ఈశాన్య భారతంలోని ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.అరుణాచల్ ప్రదేశ్ లో రూ. 4.5కోట్లు, మణిపూర్ లో 2కోట్లు, మిజోరం లో రూ.2.1 కోట్లు, నాగాలాండ్ లో

    రూ. 2.8కోట్లు, మేఘాలయ లో 8.5 కోట్ల రూపాయ‌ల నిధిని ప్రజలు సమర్పించారు.

    ఇప్పటి వ‌ర‌కు నిధి స‌మ‌ర్పణ చేయ‌ని వారు కూడా  https://srjbtkshetra.org/donation-options/ వెబ్‌సైట్ ద్వారా శ్రీ రామ జన్మభూమ తీర్థ క్షేత్ర ఖాతాకు నేరుగా స‌మ‌ర్పణ చేయ‌వ‌చ్చని తీర్థక్షేత్ర ట్రస్ట్ సూచించింది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి 1100కోట్ల వరకు ఖర్చు అవుతుందని తీర్థక్షేత్ర ట్రస్ట్ అంచనా వేసింది. 2023 నాటికి ప్రధాన మందిర నిర్మాణం పూర్తి చేయాలని ట్రస్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. 

    Related Stories