More

    కర్ణాటక నుండి అయోధ్యకు వెళ్తున్నారు.. యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం

    ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టూరిస్ట్‌ బస్సు-ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందగా, 9 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. లఖింపూర్‌ బహ్రైచ్‌ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఓ మహిళ కూడా ఉన్నారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయాలైనవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కర్ణాటక నుంచి అయోధ్యకు దర్శనం కోసం వెళ్తున్నారు. ఆ ట్రావెలర్ వాహనంలో మొత్తం 16 మంది ప్రయాణిస్తున్నారు.

    బహ్రైచ్‌లో రోడ్డు ప్రమాదంలో జరిగిన ప్రాణనష్టంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు యూపీ ముఖ్యమంత్రి తెలిపారు.

    Trending Stories

    Related Stories