భారతదేశంతో ఆస్ట్రేలియా కొత్త వాణిజ్య ఒప్పందాన్ని సెలెబ్రేట్ చేసుకోడానికి.. ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్ గుజరాతీ వంటకాలను స్వయంగా వండడం విశేషం. ప్రధాని నరేంద్ర మోదీకి ఇష్టమైన ఖిచ్డీని కూడా తయారు చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్ మారాయి.
స్కాట్ మోరిసన్ తన స్టవ్ దగ్గర ఖిచ్డీ, మరికొన్ని పాన్‌లలో ఇతర ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. అతని డైనింగ్ టేబుల్ మీద సర్వ్ చేయడానికి సిద్ధం చేసిన వంటకాలు ఉన్నాయి. “భారత్‌తో మా కొత్త వాణిజ్య ఒప్పందాన్ని సెలెబ్రేట్ చేసుకోడానికి, ఈ రాత్రి నేను ఎంచుకున్న కూరలు అన్నీ నా ప్రియ మిత్రుడు ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ రాష్ట్రానికి చెందినవి, అందులో ఆయనకు ఇష్టమైన ఖిచ్డీ కూడా ఉన్నాయి” అని మోరిసన్ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. భారత్‌తో తమ కొత్త వాణిజ్య ఒప్పందం జరిగిన నేపథ్యంలో రాత్రి వేళ వంటల తయారీ కోసం ఎంచుకున్న ఆహారం ప్రియమైన మిత్రుడు ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ప్రాంతానికి చెందినవి అని మోరిసన్ అన్నారు. ఆయన వంటగదిలో ఉన్న ఫొటోను షేర్ చేసి.. అందర్ని ఆశ్యర్యపరిచారు.
ఏప్రిల్ 2న భారతదేశం – ఆస్ట్రేలియా ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ వాణిజ్య ఒప్పందం ప్రకారం.. కాన్‌బెర్రా.. వస్త్రాలు, తోలు, ఆభరణాలు, క్రీడా ఉత్పత్తుల వంటి 95 శాతానికి పైగా భారతీయ వస్తువులకు మార్కెట్లో సుంకం రహిత యాక్సెస్ లభించనుంది. భారతదేశం-ఆస్ట్రేలియా ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందంపై పీయూష్ గోయల్, ఆస్ట్రేలియా వాణిజ్యం, పర్యాటకం-పెట్టుబడి శాఖల మంత్రి డాన్ టెహన్ సంతకాలు చేశారు.