More

  కాషాయంకు జిహాద్‎ను పులిమే ప్రయత్నం చేసిన ఉదయపూర్ నిందితులు..!

  ఉదయపూర్ హంతకులకు సంబంధించి విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత మతోన్మాదుల చర్యగా భావించినా.. తర్వాత వారికి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్ధతో సంబంధాలు ఉన్నట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. ఆ తర్వాత వారు దేశంలో పలు ఉగ్రవాద కార్యక్రమాలకు సహకారం అందించినట్లు తెలిసింది.

  పాకిస్తాన్ కు పలు మార్లు ఫోన్లు మాట్లాడినట్లు వెలుగులోకి వచ్చింది. తాజాగా వారి మరో మాస్టర్ ప్లాన్ అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దేశంలో విధ్వంసం సృష్టించేందుకు వాళ్లు బీజేపీని అడ్డుగా పెట్టుకునే ప్రయత్నం చేసినట్లు విచారణలో వెల్లడైంది. బీజేపీ పార్టీలో చేరేందుకు ఉదయపూర్ నిందితులు ప్రయత్నించినట్లు ఓ జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేసింది. టైలర్ కన్హయ్య హత్య కేసులో నిందితుల్లో ఒకరైన రియాజ్ అత్తారి గత మూడు సంవత్సరాలు రాజస్థాన్ బీజేపీలో చేరేందుకు ప్రత్నించినట్లు కొన్ని ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. టైలర్ హత్యకు ముందు కూడా వీరు కమల దళంలోకి చేరే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

  రాజస్థాన్ రాష్ట్రంలో బీజేపీ నిర్వహించే కార్యక్రమాలకు రియాజ్ హజరైనట్లు అక్కడి బీజేపీ నేతలు చెబుతున్నారు. అలాగే 2019లో హజ్ యాత్ర నుంచి తిరిగి వచ్చిన రియాజ్‎ను బీజేపీ మైనారిటీ మోర్చా నాయకుడు ఇర్షాద్ చైన్ వాలా స్వాగతం పలికిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. అప్పటికీ రియాజ్ పార్టీలో చేరలేదు. అయితే ఆ నిందితుడు గత 10 సంవత్సరాలుగా రాజస్థాన్ బీజేపీతో సంబంధాలు కలిగి ఉన్నట్లు విచారణలో తేలింది. రియాజ్ తో ఉన్న ఫోటోలు వెలుగులోకి రావడంతో బీజేపీ మైనారిటీ మోర్చా నాయకుడు ఇర్షాద్ చైన్ వాలా స్పందించారు. అవి తన ఫోటోలే అని ఒప్పుకున్నారు. అతను ఉమ్రా నుంచి తిరిగి వచ్చినందున తాను అతనికి పూల మాల వేసినట్లు చెప్పారు. అతను బీజేపీ నాయకుడు గులాబ్ చంద్ కటారియా నిర్వహించిన అనేక కార్యక్రమాలకు హజరైనట్లు ఇర్షాద్ వెల్లడించారు. అయితే ఆ కార్యక్రమాలకు అతనితో పాటు మరికొంతమంది వచ్చే వారని చెప్పారు. అతను తనంతట తానే పార్టీ కార్యక్రమాలకు వచ్చేవాడని.. తాను పార్టీతో కలిసి పని చేయాలనుకుంటున్నట్లు తనకు ఎన్నోసార్లు ఇతరులతో సమాచారం ఇచ్చాడని ఇర్షాద్ వెల్లడించారు.

  బిజెపి మైనారిటీ మోర్చా నాయకుడు తెలిపిన వివరాల ప్రకారం, ఉదయపూర్ మరో నిందితుడు హంతకుడు మహ్మద్ తాహిర్ అనే వ్యక్తి పార్టీ కోసం పని చేసే వ్యక్తిగా అందరికి తెలుసని అర్ధం అవుతుంది. అతను తమ పనివాడని… తాహిర్ రియాజ్‌తో సన్నిహితంగా ఉండేవాడని ఇర్షాద్ చైన్‌వాలా స్పష్టం చేశారు. అలాగే తాహిర్, రియాజ్ కలిసి ఉన్న అనేక ఫోటోలు ఉన్నట్లు చెప్పారు. అయితే రియాజ్ ను మాత్రం తాము ఫోన్ లో సంప్రదించలేకపోయేవాళ్లమని.. అద్దె ఇళ్లు అడ్రస్ కూడా చెప్పలేదని స్థానిక బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇక్కడ ఓ ఆసక్తికరమైన విషయం ఏంటంటే రియాజ్ బీజేపీ కార్యక్రమాలకు పబ్లిక్ గా హజరవుతూ.. ప్రైవేటుగా అదే పార్టీని విమర్శించే వాడని తెలిసింది. తన సన్నిహితులతో కమలదళాన్ని అనేక సార్లు విమర్శించినట్లు విచారణలో తేలింది. అయితే ఇక్కడ నిందితుల మాస్టర్ మైండ్ స్పష్టం అర్ధం అవుతోంది. కన్హయ్య లాల్ హంతకుడు రియాజ్ బీజేపీలో చేరి నేరాలకు పాల్పడి, చివరకు హిందువులపైకి నెట్టేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. జిహాదీలకు ఇలాంటి నేరపూరిత పూర్వాపరాలు గతంలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వారి ఇస్లామిక్ తీవ్రవాద ప్లాన్ లో భాగంగా వారు పార్టీలో చేరాలని, జిహాదీ కార్యకలాపాలకు పాల్పడి.. దానిని బిజెపి, హిందువులపై రుద్దాలనుకుంటే మాత్రమే బిజెపిలోకి చొరబడటానికి ప్రయత్నిస్తారని అధికారులు చెబుతున్నారు.

  ఇక నిందితులు వాడుతున్న బైకు విషయంలో కూడా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వెలుగులోకి వచ్చింది. రియాజ్ తన బైక్ కోసం కస్టమైజ్డ్ నంబర్ 2611 కొనుగోలు చేయడానికి 5 వేల రూపాయలు చెల్లించినట్లు వెలుగులోకి వచ్చింది. జూన్ 28న కన్హయ్య లాల్‌ను దారుణంగా హత్య చేసిన తర్వాత అక్కడి నుంచి తప్పించుకోవడానికి అతను, అతని సహచరుడు మహమ్మద్ గౌస్ అదే బైక్‌ను ఉపయోగించారు. ఈ సంఖ్యను 2013లో రిజిస్టర్ చేసుకున్నారు. 2611 అంటే నవంబర్ 26వ తేదీ అని అర్ధం. అజ్మల్ కసబ్, లష్కరే తోయిబాకు చెందిన ఇతర పాకిస్తానీలు 2008లో ముంబైలో అల్లకల్లోలం సృష్టించిన రోజు 26/11 ఉగ్రదాడిని సూచిస్తుంది. ఈ విషయం తెలిసి అధికారులు సైతం విస్తుపోయారు. భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన ఉగ్రవాద దాడుల్లో ఒకటైన పాకిస్తాన్ మద్దతు గల ఉగ్రవాదులు ఎంచుకున్న తేదీకి అనుగుణంగా ఒక సంఖ్యను ఎంచుకోవడానికి ఈ ఇస్లామిస్టులు ఎంత తీవ్రవాదానికి పాల్పడ్డారో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

  Trending Stories

  Related Stories