భారత్ లో పాక్ మళ్లీ ఉగ్రదాడులను ప్రోత్సహించబోతోందా..?

0
766

ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) గ్రే లిస్ట్‌లో ఇటీవలే పాకిస్థాన్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే..! ఆ లిస్టులో నుండి బయట పడడానికి పాకిస్థాన్ చాలా డబుల్ గేమ్స్ ఆడింది. తాము ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నట్లు చెప్పుకొచ్చింది.. ఓ వైపు తీవ్రవాద నాయకులకు రాజభోగాలు అందిస్తూనే, వారిని జైలులో పెట్టామంటూ ప్రచారం చేసుకుంది.

గ్రే లిస్ట్‌లో నుండి బయటకు రాగానే పాకిస్థాన్ తీవ్రవాదం జూలు విదిలించే అవకాశం ఉందని భారత్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. పాక్ గ్రే లిస్టులో ఉన్నపుడు ఉగ్రదాడులు తగ్గాయని భారత దేశం తెలిపింది. ఇప్పుడు ఆ జాబితా నుంచి పాక్‌ను తొలగించడం వల్ల దాడులు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి కౌంటర్ టెర్రరిజం కమిటీ ఈ అంశాన్ని పరిశీలించాలని కోరింది. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, మనీలాండరింగ్‌కు పాల్పడటం వంటివాటిని నిరోధించేందుకు పాకిస్థాన్‌ను 2018లో ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లో పెట్టారు. ఈ జాబితాలో ఉండటం వల్ల అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF), ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, యూరోపియన్ యూనియన్‌ల నుంచి ఆర్థిక సాయం పొందడం పాక్‌కు కష్టంగా ఉండేది. అసలే ఆర్థికంగా కుదేలైన పాక్ కు ఆర్థిక సాయం ఎంతో అవసరం కావడంతో తీవ్రవాదంపై చర్యలు తీసుకుంటున్నామని ప్రకటనలను విడుదల చేసింది.