కరీంనగర్ జిల్లా మానకొండూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కి చేదు అనుభవం ఎదురైంది. ఆయన కాన్వయ్ పై కొందరు యువకులు దాడి చేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించాలని డిమాండ్ చేస్తూ కొందరు యువకులు బాలకిషన్ కాన్వాయ్ పై దాడికి యత్నించారు. ఈ ఘటనలో బాలకిషన్ కు ఎలాంటి గాయాలు అవ్వలేదు.
యువజన సంఘాల నాయకులు పలు సమస్యలు తీర్చాలని నిర్మాణం చేపట్టారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం నుంచి రసమయి ఎమ్మెల్యేగా గెలిచారు. గన్నేరువరం మండల కేంద్రంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన యువజన సంఘాలు తమకు డబుల్ లైన్ రోడ్డుతో పాటు డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని ధర్నా చేస్తున్నారు. ఆదివారం ఆ ధర్నా శిబిరం మీదుగా వెళుతున్న రసమయిని నిరసనకారులు అడ్డుకునే యత్నం చేశారు. యువజన సంఘనాయకులు ఒక్కసారిగా కాన్వాయ్ పై రావడంతో.. డ్రైవర్ ముందుకు తీసుకువెళ్లాడు. పోలీసులు వచ్చి యువకులపై లాఠీఛార్జ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తతనెలకొంది. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో గాయాల పాలైన యువకులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.