బీజేపీ నేత తీన్మార్ మల్లన్న పై దాడి

0
769

భారతీయ జనతా పార్టీ నేత తీన్మార్ మల్లన్నపై గుర్తు తెలియని టీఆర్‌ఎస్ కార్యకర్తలు కొందరు దాడి చేశారు. క్యూన్యూస్ ఆఫీసులోకి మాస్కులతో ప్రవేశించిన కొందరు మల్లన్నపై దాడికి దిగారు. ఏం అనుకుంటున్నార్రా? అంటూ తోసుకుంటూ వెళ్లారు. తన ట్విట్టర్‌ను హ్యాక్ చేశారని తీన్మార్ మల్లన్న సమాధానం చెబుతున్నా కూడా కొందరు వినకుండా దాడికి ప్రయత్నించారు. ఆ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆఫీసులోని ఇంకొందరు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టు వీడియోలో చూడొచ్చు. అప్పటికే ఫర్నీచర్ ధ్వంసం చేశారు. తన ట్విట్టర్ హ్యాక్ చేశారని తీన్మార్ మల్లన్న పదేపదే చెప్పారు. తీన్మార్ మల్లన్నపై దాడి చేసినవారు టీఆర్ఎస్ కార్యకర్తలుగా భావిస్తున్నారు. క్యూ న్యూస్ కార్యాలయంలోకి బలవంతంగా ప్రవేశించి తీన్మార్ మల్లన్న మరియు ఇతర వ్యక్తులపై దాడి చేశారు.

మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షుపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని మల్లన్న వివరణ ఇచ్చారు. తీన్మార్ మల్లన్నపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్యూన్యూస్ సంస్థ ట్విట్టర్ లో నిర్వహించిన పోల్ లో.. అభివృద్ధి ఎక్కడ జరిగింది? భద్రాచలం గుడిలోనా? హిమాన్షు శరీరంలోనా? అనే పోల్ ఈ వివాదానికి తెర తీసింది. అయితే ఈ ట్వీట్ తాను పెట్టలేదని.. తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని.. ఇలాంటి ట్వీట్లు తాను పెట్టను అని అన్నారు. తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని.. ఎవరో ఈ పని చేసి ఉంటారని మల్లన్న వివరణ ఇచ్చారు. 20 మంది గూండాలు వచ్చి కార్యాలయంపై దాడి చేశారని, ఉద్యోగులపై దాడి చేసి.. ఎక్కడికక్కడ కొట్టారని మల్లన్న విమర్శించారు. పోలీసులకు ఫోన్ చేసి 20 నిమిషాలు అయినా కూడా పత్తా లేరని విమర్శించారు. స్థానికులను అడిగితే ఆఫీసుపై ఎంత ఘోరంగా దాడి జరిగిందో చెబుతారని అన్నారు.

https://www.facebook.com/BJP4KMRASSEMBLY/videos/641941790169896