More

    విఘ్నేశ్వరుడి ఆలయంలోకి ప్రవేశించి.. విధ్వంసం సృష్టించి..

    పాకిస్తాన్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆలయాల కూల్చివేత.. బలవంతంగా మత మార్పిడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక హిందూ అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలపై పాకిస్తాన్ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు. ఎక్కడా లేని తీరున పాకిస్తాన్ లో మైనారిటీల మీద ముఖ్యంగా హిందువుల మీద దాడులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. మైనారిటీలకు అండగా నిలబడతామని మాటలు చెప్పడానికి మాత్రమే పాకిస్తాన్ నాయకులు పరిమితమయ్యారు.

    ఇప్పటికే పాక్ భూభాగంలోని ఎన్నో హిందూ దేవాలయాలను కూల్చి వేశారు. కొన్ని వందల, వేల సంవత్సరాల చరిత్ర ఉన్న హిందూ దేవాలయాలు దీనమైన స్థితిలో ఉన్నాయి. ఇక పాకిస్తాన్ లో హిందూ దేవాలయాలపై దాడులు నిత్యకృత్యమయ్యాయి. పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని విఘ్నేశ్వరుడి ఆలయాన్ని ఓ బృందం ధ్వంసం చేసింది. ఆలయంలోని చాలా భాగాలు దగ్ధమయ్యాయి. విగ్రహాలను అపవిత్రం చేశారు. రహీమ్ యార్ ఖాన్ జిల్లాలోని భోంగ్ నగరంలో బుధవారం నాడు ఈ దాడి చోటు చేసుకుంది.

    ఈ విషయం తెలుసుకున్న పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్లమెంటేరియన్ డాక్టర్ రమేష్ కుమార్ వాంక్వానీ ట్విట్టర్‌లో దేవాలయంపై దాడి వీడియోలను పోస్ట్ చేశారు. దేవాలయాన్ని ధ్వంసం చేయడం ఆపాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరారు.

    కర్రలు, రాళ్లు, ఇటుకలతో దాడి చేశారు. మతపరమైన నినాదాలు చేస్తూ దేవతల విగ్రహాలనును ధ్వంసం చేశారని వాంక్వానీ అన్నారు. వరుస ట్వీట్లలో ఆలయంపై దాడిని ఖండించారు. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. చీఫ్ జస్టిస్ చర్యలు తీసుకోవాలని కోరారు.

    ఆలయం బాగా దెబ్బతిన్నట్లు పోలీసు అధికారులు ధృవీకరించారు. పోలీసులు అల్లరిమూకను నియంత్రించడంలో విఫలమైంది. దీంతో పరిస్థితిని నియంత్రించడానికి పాకిస్తాన్ రేంజర్‌లను పిలవవలసి వచ్చింది. ఈ ఘటనలో ఎవరినీ అరెస్టు చేయలేదు.

    కొంతమంది వ్యక్తులు ఈ దాడిని సమర్థించడానికి ప్రయత్నించారు. ఎనిమిది సంవత్సరాల హిందూ బాలుడు గత వారం ఆ ప్రాంతంలోని ఒక ముస్లిం సెమినరీ లైబ్రరీ దగ్గర మూత్ర విసర్జన చేసాడు. 8 ఏళ్ల బాలుడు మూత్ర విసర్జన చేసినందుకు ప్రతీకారంగా ఆలయంపై కొందరు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆ ఘటనలో 8 ఏళ్ల బాలుడిని పాకిస్తాన్ దైవదూషణ చట్టాల కింద గత వారం అరెస్టు చేశారు. కాని తరువాత మైనర్ అయినందున బెయిల్‌పై విడుదల చేశారు.

    హిందువులపైనా.. హిందూ దేవాలయాల పైన దాడులను ఖండించిన భారత ప్రభుత్వం:

    కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ విధ్వంసానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. పాకిస్తాన్ లో హింసించబడుతున్న మైనారిటీలకు భారతీయ పౌరసత్వాన్ని అందించే చట్టం అయిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (CAA) వ్యతిరేకిస్తున్న వారిపై విమర్శలు చేశారు.

    “ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా ఎందుకు CAA బిల్లును ఎందుకు ప్రవేశపెట్టారో ఇప్పుడు అర్థం అవుతోంది. హిందువులతో సహా ఇతర మైనారిటీ మతాలకు పాకిస్తాన్‌లో ఎటువంటి రక్షణ కనిపించడం లేదు? పాకిస్థాన్‌లోని రహీమ్యార్ ఖాన్ జిల్లాలోని గణేశుడి దేవాలయంపై దాడులకు సంబంధించిన ఈ వీడియో మీ ప్రశ్నలకు సమాధానమిస్తుంది ”అని షెకావత్ వీడియోతో పాటు ట్వీట్ చేశారు. పాకిస్తాన్‌లోని మైనారిటీలందరూ రోజూ ఈ పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నారని ఆయన ట్వీట్ చేశారు.

    దాడులు జరుగుతున్నా పట్టించుకోని పాక్ ప్రభుత్వం:

    మైనారిటీలపై దాడులకు పాల్పడుతున్నా పాక్ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడంలేదు. మైనారిటీలపై ఎన్ని ఘోరాలు జరిగినా చీమ కుట్టినట్లు కూడా ఆ దేశంలోని నాయకులకు అనిపించడం లేదు. గత కొన్ని దశాబ్దాలుగా అక్కడ జరుగుతోంది ఇదే..! హిందూ దేవాలయాన్ని తగలబెట్టిన నిందితుడికి క్షమాభిక్ష పెడుతూ ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్‌లో కైబర్ పఖ్తుంఖ్వాలోని కరాక్ జిల్లాలోని కృష్ణుడి ఆలయాన్ని కూల్చివేసిన దాదాపు ఏడు నెలల తర్వాత, పాకిస్తాన్ యొక్క ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రభుత్వం హిందూ దేవాలయాన్ని తగలబెట్టిన 350 మందిపై కేసులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రభుత్వం గత సంవత్సరం శతాబ్దం నాటి ఆలయాన్ని కూల్చివేసిన గుంపుపై కేసులను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. హిందూ సమాజం వారిని క్షమించినట్లుగా ప్రభుత్వం చెబుతోంది.

    Trending Stories

    Related Stories