తమిళనాడులో ఆలయాలను కూల్చివేయడం, విగ్రహాలను ధ్వంసం చేయడం వంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తమిళనాడులోని రాణిపేట ఆలయంలోకి వెళ్లిన కొందరు దుండగులు ఎన్నో ఘోరాలు ఆలయంలో చేశారు. రాణిపేటలోని హిందూ దేవాలయంలోని దేవతల విగ్రహాలు కొందరు దుండగులచే అపవిత్రం చేయబడింది. దేవతలపై వీర్యం స్ఖలించబడిన ఘటన బయటకు వచ్చింది. అమ్మాన్ మరియు దుర్గా దేవతల విగ్రహాలపై ఈ దాడులు చోటు చేసుకున్నాయి. ఇటీవలి కాలంలో ఈ ఆలయం అపవిత్రం కావడం ఇది మూడోసారి. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో భక్తులలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది.
తమిళనాడులోని కావేరిపక్కం సమీపంలోని కొండపురం గ్రామంలోని పంచ లింగేశ్వర ఆలయంలో జరిగింది. పంచ లింగేశ్వర ఆలయం తమిళనాడు ప్రభుత్వ హెచ్‌ఆర్‌సిఇ (హిందూ మత మరియు స్వచ్ఛంద ఎండోమెంట్స్) నియంత్రణలో ఉన్న శివాలయం. నివేదికల ప్రకారం.. జూన్ 20 న ఉదయం సమయంలో ఆలయాన్ని చూసుకుంటున్న ఓ వ్యక్తి అక్కడికి చేరుకున్నప్పుడు, కామాక్షి అమ్మాన్ మరియు దుర్గా సన్నిధిలోని తాళాలు విరిగిపోయినట్లు గుర్తించాడు. లోపలికి వెళ్లి చూస్తే, విగ్రహాలు విరిగిపోయి కనిపించాయి. అలాగే చీరలు నేలపై కాలిపోయినట్లు గుర్తించారు. ఆ దుర్మార్గులు విరిగిపోయిన విగ్రహాలపై స్ఖలనం చేశారు. ఈ సంఘటన కనుగొనబడిన తరువాత భక్తులు, హిందూ మున్నాని సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు.
ఇటీవలి కాలంలో ఆలయం అపవిత్రం కావడం ఇది మూడవసారి. ఈ ఆలయాన్ని వివిధ వర్గాలకు చెందిన భక్తులు సందర్శిస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న కొంతమంది మతమార్పిడులకు పాల్పడుతూ ఉన్నారు.. ఈ సంఘటన వెనుక వారే ఉండవచ్చని స్థానికులు ఆరోపించారు. ఈ ఆలయంపై పదేపదే దాడులు చేసినప్పటికీ హెచ్ఆర్సిఇ డిపార్ట్మెంట్ ఆలయ రక్షణలో విఫలమైందని హిందూ మున్నాని, విశ్వ హిందూ పరిషత్ నేతలు ఆరోపించారు. ఈ సంఘటన చోటు చేసుకున్న తర్వాత కూడా ఆలయాన్ని సందర్శించడానికి డిపార్ట్‌మెంటల్ అధికారి ముందుకు రాలేదు.
విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర నిర్వాహకుడు సరవణ కార్తీక్ మాట్లాడుతూ “డిఎంకె అధికారంలోకి వచ్చినప్పుడల్లా హిందువులు, హిందూ దేవాలయాలపై నేరాలు అధికంగా జరుగుతూ ఉన్నాయి” అని ఆరోపించారు. ఇటీవలి కాలంలో తమిళనాడులో ఆలయాలపై దాడులు అధికమయ్యాయి. ఈ ఘటనలపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.