National

ఆగని తృణమూల్ నేతల ఆగడాలు.. నటుడు రుద్రనీల్ పై దాడి

భారతీయ జనతా పార్టీ నేతలపైనా, కార్యకర్తలపైనా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతల దాడులు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ఎన్నో గ్రామాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల దాడులకు భయపడి ఎంతో మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారు. ఎక్కడికీ వెళ్లలేక అక్కడే ఉంటున్న వారిపై తృణమూల్ నేతలు దాడులకు పాల్పడుతూ ఉన్నారు. ఈ ఘటనలపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు.

నటుడు రుద్రనీల్ ఘోష్ భారతీయ జనతా పార్టీలోని సభ్యుడు. దక్షిణ కోల్ కతా లోని భబానీ పూర్(వార్డు 71)లో అతడిపై దాడి జరిగింది. కరోనా ద్వారా ఉపాధి కోల్పోయిన వారికి రుద్రనీల్ తన వంతుగా సహాయం చేస్తూ ఉండగా.. అతడిపై దాడి జరిగింది. దీంతో రుద్రనీల్ పోలీసులకు పిర్యాదు చేశారు. తృణమూల్ గూండాలు తనపై ఈ దాడికి పాల్పడ్డారని కాళీఘాట్ పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశారు. అయితే దీనికి తమకూ ఎటువంటి సంబంధం లేదని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది.

రుద్రనీల్ మాట్లాడుతూ తాము కరోనా బాధితులకు సహాయం చేయడానికి వెళ్లిన సమయంలో తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన నాయకులు తమను అడ్డుకున్నారు. నా అనుచరులపై కూడా దాడి చేశారు. 300 కుటుంబాలకు తాము సహాయం చేశామని 71వ వార్డులో తృణమూల్ నేత బబ్లూ సింగ్ తన అనుచరులతో వచ్చి దాడి చేశాడు.. నన్ను కూడా కొట్టారు అని తెలిపారు. తనతో పాటూ వచ్చిన వ్యక్తుల మీద కూడా దాడి చేశారని రుద్రనీల్ అన్నారు. రిలీఫ్ వాహనంపై కూడా దాడి చేశారని.. ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారని ఆరోపించారు.

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ దాడికి తాము బాధ్యులం కాదని చెబుతోంది. రుద్రనీల్ ఒక నటుడని.. ఎన్నికల్లో ఓడిపోయాక కూడా ఇక్కడ కూడా నటన కొనసాగిస్తూ ఉన్నారని తృణమూల్ నేతలు చెప్పారు. అతన్ని కొట్టాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. తృణమూల్ నేత బబ్లూ మాట్లాడుతూ.. ‘రిలీఫ్ మెటీరియల్ ను పంచడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అనుమతులు తీసుకున్నావా అని మాత్రమే అడిగానని.. ఆ సమయంలోనే చిన్న పాటి వాదన నడిచింది తప్పితే.. ఎటువంటి గొడవ లేదని’ తెలిపాడ.

భబానీ పూర్ అసెంబ్లీ స్థానం నుండి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేయాలని నిర్ణయించారు. ఇటీవలి ఎన్నికల్లో నందిగ్రామ్ నుండి పోటీ చేసిన మమతా బెనర్జీ.. సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా గెలిస్తేనే మమతా బెనర్జీకి ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉంటుంది. ఇంతకు ముందు భబానీ పూర్ అసెంబ్లీ స్థానం నుండి గెలుస్తూ వచ్చిన మమతా బెనర్జీ.. సువేందు అధికారిని ఓడించాలని నందిగ్రామ్ నుండి పోటీ చేసింది. అక్కడ ఆమెకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మమతా బెనర్జీ కోసం శోభన్ దేబ్ చటోపాధ్యాయ మే 21న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అక్కడే మమతా బెనర్జీ మరోసారి నిలబడి గెలవాలని అనుకుంటున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × 4 =

Back to top button