More

    జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి.. లష్కరే తోయిబా పనే

    జమ్మూ కశ్మీర్ లో ఉగ్ర కలకలం మొదలైంది. సోపోర్ లో సీఆర్పీఎఫ్, కశ్మీర్ పోలీసుల సంయుక్త బృందంపై ఉగ్రవాదులు గ్రనేడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు, ఇద్దరు పౌరులు మృతి చెందారు. ఓ పోలీసు సహా ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను సైనిక ఆసుపత్రికి తరలించారు. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్ పట్టణంలో సీఆర్పీఎఫ్, పోలీసు బలగాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని.. మొదట గ్రనేడ్లు విసిరి, ఆపై కాల్పులు జరిపారు. దాడి సమాచారం తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు అదనపు బలగాలను సంఘటన స్థలానికి తరలించారు. అక్కడి మెయిన్ చౌక్ ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టాయి.

    ఘటన అప్డేట్:

    బారాముల్లా జిల్లాలోని సోపోర్ పట్టణంలోని అరంపోరాలో శనివారం నాడు ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ పోలీసు సిబ్బందిపై, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) పై దాడి చేశారు. ఇద్దరు పౌరులు మరణించగా, ఇద్దరు పోలీసు సిబ్బంది మరణించారు. దాడిలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ తో సహా ముగ్గురు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. మరో ఇద్దరు పౌరులకు కూడా గాయాలయ్యాయని సోర్సెస్ సూచిస్తున్నాయి.ఈ విషయం గురించి మాట్లాడుతున్న కాశ్మీర్ ఐజి విజయ్ కుమార్ మాట్లాడుతూ సోపోర్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో ఇద్దరు పోలీసులు, ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు పోలీసు సిబ్బంది గాయపడ్డారని తెలిపారు. ఈ దాడి వెనుక లష్కర్-ఎ-తైబా ఉందని వెల్లడించారు.

    కోవిడ్ -19 విధుల్లో భాగంగా అరంపోరా ప్రాంతంలో పోలీసు బృందాన్ని నియమించారు. ఆ సమయంలోనే ఈ దాడి చోటు చేసుకుంది. ఈ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతూ ఉన్నారు. ఉగ్రవాదులను పట్టుకోవటానికి దర్యాప్తు ప్రారంభించారు. పరిస్థితిని విశ్లేషించడానికి సీనియర్ పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ సోపోర్ నుండి భయంకరమైన వార్తలు వస్తున్నాయని.. ఇలాంటి దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని.. మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు.

    మెహబూబా ముఫ్తీ అనుచరుడిపై పోలీసుల సంచలన ఛార్జ్ షీట్:

    జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అనుచరుడు పిడిపి సీనియర్ నాయకుడు వహీద్-ఉర్-రెహమాన్ పర్రాపై జమ్మూ కాశ్మీర్ పోలీసులు తమ చార్జిషీట్‌లో సంచలనాత్మక విషయాలను వెల్లడించారు. 19 పేజీల చార్జిషీట్‌లో 2007 నుండి జర్నలిస్టుగా, రాజకీయ నాయకుడిగా పార్రా చేసిన 13 సంవత్సరాల ప్రయాణాన్ని మభ్యపెట్టే, మోసపూరిత విషయంగా అభివర్ణించింది. జమ్మూ కాశ్మీర్‌లో పనిచేస్తున్న ఉగ్రవాదులతో పర్రా చేతులు కలిపాడని, పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థల నుంచి ఆదేశాలు తీసుకున్నాడని చార్జిషీట్ లో ఆరోపించారు. పాకిస్తాన్ కు చెందిన టెర్రర్ గ్రూపులకు పర్రా ఎంతగానో సహాయపడ్డాడని చార్జిషీట్ తెలిపింది. పర్రా తన రాజకీయ ఆశయాల కోసం ఉగ్రవాదులతో సంబంధాలను కొనసాగించాడని జమ్మూ కాశ్మీర్ కు చెందిన కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్ (సిఐకె) చెబుతోంది.

    Trending Stories

    Related Stories