బంగ్లాదేశ్ పౌరులకు హిందూ పేర్లతో నకిలీ పాస్‌పోర్ట్‌లు ఇచ్చి విదేశాలకు పంపిన మానవ అక్రమ రవాణా రాకెట్‌కు సంబంధించి ఉత్తరప్రదేశ్ ATS 9 మంది బంగ్లాదేశ్ పౌరులను అరెస్టు చేసింది. మోసం, నేరపూరిత కుట్ర ఆరోపణలతో నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అసిదుల్ ఇస్లాం, హుస్సేన్ మహ్మద్, అలమీన్ అహ్మద్, జైబుల్ ఇస్లాం, జమీల్ అహ్మద్, రాజీవ్ హుస్సేన్, షెకావత్ ఖాన్ మరియు అల్లాదీన్ తారిఖ్‌లుగా గుర్తించబడిన 8 మంది బంగ్లాదేశ్ పౌరులను అరెస్టు చేసినట్లు ATS ప్రాథమికంగా తెలియజేసింది. వీరిని విచారించిన తర్వాత UP ATS లక్ష రూపాయలు తీసుకున్న మహఫుజుర్ రెహ్మాన్‌ను కూడా అరెస్టు చేసింది. నిందితుల నుంచి ఒక్కొక్కరి నుంచి డబ్బులు వసూలు చేసి హిందూ పేర్లతో నకిలీ భారతీయ పత్రాలను అందించారు.
ATS అధికారులు మాట్లాడుతూ “బంగ్లాదేశ్ పౌరులు అందించిన సమాచారం మేరకు, ATS సోమవారం 24 పరగణ కోల్‌కతాలోని మదర్సా నుండి మహ్ఫుజుర్ రెహ్మాన్ (34)ని అరెస్టు చేసింది. రెహ్మాన్ కూడా బంగ్లాదేశ్ జాతీయుడే, అతను ఫేక్ ఐడితో భారత్ లో నివసిస్తున్నట్లు తేలింది. అతన్ని ట్రాన్సిట్ రిమాండ్‌పై లక్నోకు తీసుకువస్తున్నారు, రాకెట్‌తో సంబంధం ఉండి దేశంలో చురుకుగా ఉన్న ఇతర వ్యక్తులను గుర్తించడానికి దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసుకు సంబంధించిన విచారణ ఆధారంగా తదుపరి అరెస్టులు ఉంటాయి.
నివేదిక ప్రకారం నకిలీ భారతీయ పాస్‌పోర్ట్‌లలో అసిదుల్ ఇస్లాం విజయ్ దాస్‌గానూ, హుస్సేన్ మహ్మద్ ఫహద్ మాణిక్ దత్తాగానూ, అలమేన్ రాజేష్ బిస్వాస్‌గానూ, జైబుల్ హుస్సేన్ ఇస్లాం గోవింద దాస్‌గానూ, రాజీవ్ హుస్సేన్ అజిత్ దాస్‌గానూ, షేకావత్ ఖాన్ గోలక్ మండల్ గానూ, అల్లాదీన్ తారిఖ్ రింకోన్ బిస్లీష్, జమీల్ అహ్మద్ పలస్ బిస్వాస్ గానూ మారారు.
బంగ్లాదేశ్ జాతీయులు పాడుబడిన మదర్సాలో హిందీ భాషలో మాట్లాడటానికి, సంతకం చేయడానికి శిక్షణ పొందారు. తర్వాత ఈ అక్రమ బంగ్లాదేశీయులకు హిందూ పేర్లతో నకిలీ భారతీయ పాస్‌పోర్టులు ఇచ్చి విదేశాలకు పంపేందుకు సిద్ధం చేశారు. మానవ అక్రమ రవాణా కేసులో అక్టోబర్ 26న మిథున్ మండల్, షాన్ అహ్మద్, మోమినూర్ ఇస్లాం మరియు మహేంది హసన్‌లను మొఘల్‌సరాయ్‌లోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్ నుండి అరెస్టు చేశారు. మిథున్ మండల్, షాన్ అహ్మద్, మోమినూర్ ఇస్లాం, మహేంది హసన్ అందించిన సమాచారం ఆధారంగా కాన్పూర్‌లోని బంగ్లాదేశ్ జాతీయులను అరెస్టు చేసినట్లు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఐజి గజేంద్ర గోస్వామి తెలిపారు. నకిలీ పత్రాలను రూపొందించి, బంగ్లాదేశీయులు మరియు రోహింగ్యాలు భారతదేశం మరియు విదేశాలకు అక్రమంగా ప్రవేశించడానికి వీలు కల్పించినందుకు నవంబర్‌లో పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నుండి ఇద్దరు రోహింగ్యాలైన నూర్ ఆలం, మహ్మద్ జమీల్‌లను UP ATS అరెస్టు చేసింది.