Telugu States

ముగిసిన ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్

ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు 61.75 శాతం పోలింగ్ నమోదైనట్లు పోలింగ్‌ అధికారులు చెప్పారు. 6 గంటలకు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. వైసీపీ తరపున గౌతంరెడ్డి సోదరుడు మేకపాటి విక్ర౦రెడ్డి, బీజేపీ తరఫున భరత్‌కుమార్‌తో పాటు మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నెల 26న కౌంటింగ్‌ జరుగనుంది.మొత్తం 279 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ జరగ్గా పలు ప్రాంతాల్లో చెదురుముదురు సంఘటనలు చోటుచేసుకున్నాయి. 1,339 జనరల్, 1032 మంది పోలీసు సిబ్బందిని నియ‌మించిన‌ట్లు అధికారులు తెలిపారు. వీరితోపాటు 142 మంది మైక్రో అబ్జర్వర్లు, 38 మంది సెక్టార్ అధికారులు విధులు నిర్వహించారు. పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు చాలా పలుచగా ఉండటంతో త్వరగా పోలింగ్‌ ముగించారు.

Related Articles

Back to top button