రెండు రోజుల్లో 67మంది.. అగ్రరాజ్యంలో అంతుచిక్కని మరణాలు..!

0
791

అగ్రరాజ్యంలో పదుల సంఖ్యలో పౌరుల మరణాలు ఆ దేశాన్ని కలవరపెడుతున్నాయి. తాజాగా అమెరికాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ప్రజలు అక్కడ గన్ కల్చర్‌తో భయాందోళనలకు గురౌతున్నారు. ఈ క్రమంలో మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.

టెక్సాస్ రాష్ట్రంలోని శాన్ ఆంటోనియోలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న రైలు పట్టాల పక్కన ఒక ట్రక్‌ను గుర్తించారు. అక్కడికి వెళ్లి చూసే సరికి దానిలో అనేక శవాలు ఉన్నాయి. కనీసం 46 మందికి పైగా చనిపోయి కనిపించారని అధికారులు తెలిపారు. శాన్ ఆంటోనియో నగరం దక్షిణ శివార్లలోని మారుమూల ప్రాంతంలో రైలు పట్టాల పక్కనే ఓ ట్రక్కు నిలిపివేసి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. అనుమానాస్పదంగా ఉన్న ట్రక్కు డోర్‌ను తెరిచిచూడగా అందులో దాదాపు 46 మంది చనిపోయి ఉన్నారు. పలువురు ట్రక్కులు సజీవంగా ఉన్నవారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మెక్సికన్ సరిహద్దు నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాన్ ఆంటోనియోలో సోమవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక తేమతో 39.4 డిగ్రీల సెల్సియస్ వరకు టెంపరేచర్‌ పెరిగింది. దీంతో, వలసదారులు ట్రక్కులో మరణించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మెక్సికో నుంచి అమెరికాకు అక్రమ వలసదారులు ఎక్కువ సంఖ్యలో ట్రక్కుల్లో వెళ్తుంటారు. అంతకు ముందు కూడా వలసదారులతో వెళ్తున్న మెక్సికోకు చెందిన ట్రక్కులు ప్రమాదానికి గురి కావడంతో పదుల సంఖ్యలో మెక్సికన్లు మృతిచెందారు.

మరోవైపు సోమవారం జోహన్స్ బర్గ్ లోని ఓ నైట్ క్లబ్ లో 21 మంది టీనేజర్లు ఒకేసారి చనిపోయారు. వీరిలో అత్యంత పిన్నవయసు 13యేళ్లు. వీకెండ్ లో దక్షిణాఫ్రికాలోని టౌన్‌షిప్ టావెర్న్‌లో ఒక నైట్ అవుట్ తరువాత వీరంతా చనిపోయారు. అయితే మరణాలకు గల కారణాలు మాత్రం అస్పష్టంగా ఉన్నాయి. విద్యార్థులు తమ హైస్కూల్ పరీక్షలు అయిపోయిన సందర్భంగా శనివారం రాత్రి పార్టీ చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నామని స్థానిక అధికారులు తెలిపారు. అయితే, ఈ దుర్ఘటన గురించి తెలియగానే పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. కానీ ఆశ్చర్యంగా మృతదేహాలపై ఎలాంటి గాయాలు కనిపించలేదు. తొక్కిసలాట వల్ల చనిపోయి ఉంటారేమో అనే అంశాన్ని అధికారులు తోసిపుచ్చారు. మరణాలు విషప్రయోగం వల్ల జరిగి ఉండొచ్చేమో అనే అనుమానం వ్యక్తం చేశారు.. శవపరీక్షల ఫలితాలు వస్తే కానీ చెప్పలేమన్నారు.

ఘటన గురించి తెలియడంతో.. పిల్లల తల్లిదండ్రులతో సహా.. పెద్ద ఎత్తున జనం తూర్పు లండన్ లో విషాదం జరిగిన క్లబ్ వెలుపల గుమిగూడారు. అయితే పోలీసులు ఎవ్వరినీ అనుమతించలేదు. మార్చురీ వాహనాలు మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం తరలించాయి. ఈ విషయం తెలియగానే సీనియర్ ప్రభుత్వ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నాయి. వీరిలో నేషనల్ పోలీసు మినిస్టర్ భేకీ సెలే కూడా ఉన్నారు. ఆయన మృతదేహాలను భద్రపరిచిన గదిని పరిశీలించిన తరువాత బయటకు వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. ఇది హృదయవిదారకమైన దృశ్యమని… వారంతా చాలా చిన్నవారని ఆయన తెలిపారు. వారందరికీ 13,14 సంవత్సరాలుంటాయని తెలిసినప్పుడు.. విగతజీవులుగా పడున్న వారిని చూస్తే తన మనసు ముక్కలవుతుందంటూ భావోద్వేగానికి గురయ్యారు. చనిపోయిన వారిలో ఎనిమిది మంది బాలికలు, 13 మంది అబ్బాయిలు ఉన్నారని తూర్పు కేప్ ప్రావిన్స్ ప్రభుత్వం తెలిపింది. నైట్ క్లబ్ లో పదిహేడు మంది చనిపోయారు. మిగిలిన వారిని ఆస్పత్రికి తరలించిన తరువాత మరణించారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

12 + nineteen =