మరోసారి నెత్తురోడిన కాబూల్.. 23 మంది దుర్మరణం

0
859

ఆఫ్ఘ‌నిస్తాన్ రాజ‌ధాని కాబూల్‌లో మరోసారి నెత్తురోడింది. ఎడ్యుకేష‌న్ సెంట‌ర్ వ‌ద్ద జ‌రిగిన పేలుడులో 23 మంది మ‌ర‌ణించారు. అనేక మంది గాయ‌ప‌డ్డారు. ద‌స్తే బార్చి ఏరియాలోని కాజ్ ఎడ్యుకేష‌న్ సెంట‌ర్ వ‌ద్ద పేలుడు జ‌రిగింది. యూనివ‌ర్సిటీ ప‌రీక్ష రాస్తున్న విద్యార్థుల‌ను సూసైడ్ బాంబ‌ర్‌ టార్గెట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. హ‌జారా మైనార్టీ వ‌ర్గానికి చెందిన వాళ్లే ఆ స్ట‌డీ సెంట‌ర్ వ‌ద్ద ఎక్కువ సంఖ్య‌లో ఉన్న‌ట్లు భావిస్తున్నారు. దాడి జ‌రిగ‌న స‌మ‌యంలో విద్యార్థులు ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర‌వుతున్న‌ట్లు తెలిసింది. ఈ దర్ఘటనలో 23 మంది చనిపోయారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ పేలుడుకు పాల్పడింది ఎవరో తెలియాల్సి ఉందని అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. ఉదయం 7:30గంటలకు ఓ వ్యక్తి కాజ్ ఎడ్యుకేషన్‌ సెంటర్‌కు బాంబు ధరించి వెళ్లాడని, అనంతరం విద్యార్థుల మధ్యకు చేరుకుని తనను తాను పేల్చుకున్నాడని అధికారులు తెలిపారు.