నక్సల్స్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల పట్ల కనీస సానుభూతి కూడా లేకుండా ఇలాంటి పోస్ట్ లు పెట్టడం ఆమె దిగజారుడు ఆలోచనలకు నిదర్శనం. అమరులైన జవాన్ల గురించి అనుచిత పోస్ట్ పెట్టిన ఆమెపై దిస్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దేశద్రోహం కేసుతో పాటు పలు కేసులను ఆమెపై నమోదు చేసినట్లు గువహటి సిటీ పోలీస్ కమిషనర్ మున్నా ప్రసాద్ గుప్తా తెలిపారు. ఆమెను కోర్టులో ప్రవేశపెట్టినట్లు చెప్పారు. కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని విధించింది.
ఈ దేశంలో ప్రతి పౌరుడు నిర్భయంగా బతుకుతున్నాడు అంటే దానికి గల కారణం.. మన జవానులు.. అటువంటి మన రక్షకులను నిష్కారణంగా ఎవరు పొట్టన పెట్టుకున్నా ప్రతి భారతీయుడి గుడి రగిలిపోతుంది. కానీ నేటి సమాజంలో కొందరు మూర్ఖులు.. విదేశీ నిధులకు అమ్ముడుపోయిన బానిసలు.. సోకాల్డ్ మేధావుల ముసుగులో ఉన్న రచయితలు.. మన జవానులపై ఎంత చులకనగా వ్యాఖ్యలు చేస్తారంటే.. వీళ్లసలు మనుషులేనా.. వీరు తింటున్నది ఈ దేశపు తిండినేనా అన్న సందేహాలు కలుగకమానదు..!
చత్తీస్‌గఢ్ అడవుల్లో ఏప్రిల్ 3వ తేదీన జరిగిన ఈ పాశవిక దాడికి 24 మంది మన జవానులు అమరులైపోయిన విషాదకర ఘట్టం గురించి మనకు తెలిసిందే. ఇంతమందిని పొట్టనపెట్టుకున్న నక్సల్స్ భద్రతా బలగాల నుంచి రెండు డజన్ల ఆయుధాలను దోచుకెళ్లారు. మావోయిస్ట్ బెటాలియన్ కమాండర్ హిడ్మా ఆధ్వర్యంలో మందుపాతర పేల్చిన నక్సల్స్ ఈ ఘాతుకానికి తెగబడ్డారు. ఈ చర్యను నేను భారతీయుడను అనుకునే ఎవరైనా ఖండిస్తారు.. జరిగిన ఘోకానికి తీవ్ర వేదనకు గురవుతారు.. కానీ ఇంతకు ముందు చెప్పాకాదు.. సోకాల్డ్ సొల్లు బ్యాచ్ వారికి సిగ్గు.. నీతి అనేవి ఉండవు. అందుకే పిచ్చి కూతలు కూస్తుంటారు.
చత్తీస్‌గఢ్ అడవుల్లో నక్సల్స్ తో జరిగిన కాల్పుల్లో అమరులైన భద్రతా బలగాల సిబ్బంది గురించి అస్సోం రచయిత్రిగా పేరొన్న శిఖా శర్మ తన ఫేస్‌బుక్‌లో వివాదాస్పద పోస్ట్ పెట్టారు. ఫలితంగా పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అమరులైన 22 మంది జవాన్ల గురించి ఎఫ్‌బీ లో పోస్ట్ పెట్టిన ఆమె.. జీతాలు తీసుకుంటూ డ్యూటీలో భాగంగా చనిపోయిన వారిని అమరవీరులని పిలవొద్దని, ‘విద్యుత్ శాఖలో పనిచేసే సిబ్బంది కరెంట్ షాక్‌తో చనిపోతే వారిని అమరవీరులని అంటామా’ అని లాజిక్ చెబుతూ మరీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. మీడియా ప్రజలను భావోద్వేగానికి గురిచేయొద్దని కూడా అందులో తెలిపారు. శిఖా శర్మ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శల పాలైంది.
ఇలా నక్సల్స్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల పట్ల కనీస సానుభూతి కూడా లేకుండా ఇలాంటి పోస్ట్ లు పెట్టడం ఆమె దిగజారుడు ఆలోచనలకు నిదర్శనం. అమరులైన జవాన్ల గురించి అనుచిత పోస్ట్ పెట్టిన ఆమెపై దిస్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దేశద్రోహం కేసుతో పాటు పలు కేసులను ఆమెపై నమోదు చేసినట్లు గువహటి సిటీ పోలీస్ కమిషనర్ మున్నా ప్రసాద్ గుప్తా తెలిపారు. ఆమెను కోర్టులో ప్రవేశపెట్టినట్లు చెప్పారు. కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని విధించింది. భద్రతా బలగాల త్యాగాలను శిఖా శర్మ అవమానించారని సోషల్ మీడియాలో యావత్ భారత్ స్పందించి నినదిస్తోంది. మొత్తానికి శిఖా శర్మ ప్రస్తుతం జైలు ఊచలు లెక్కబెడుతున్నారు.
అయినా శిఖా శర్మ లాంటి వాళ్లు గతంలో కూడా ఎందరినో చూశాం. తెలుగు రాష్ట్రాల విషయానికే వస్తే అద్దంకి దయాకర్ లాంటి నేతలు నేను పాకిస్తాన్ ను ప్రేమిస్తా.. అంటూ ఉదారవాద మెసేజ్ లు ఇచ్చిన విషయం మరచిపోరాదు.
కొంచెం కటువుగా ఉన్నా ఒక్క మాటతో ఈ వీడియో ముగిస్తున్నా.. మన దేశ జవానులు జీతం కోసం పనిచేస్తారు అనడం.. తల్లిదండ్రులు తమ సుఖం కోసం పిల్లల్ని కంటారనడం రెండూ… సమానమే.. జవానును దూషిస్తే కన్నతల్లిని దూషించినట్లేననేది జాతీయవాదుల విశ్వాసం.