More

    కింద కూర్చుని బీజేపీ కార్యకర్తల కాళ్లు కడిగిన ముఖ్యమంత్రి

    అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ శనివారం బీజేపీ సీనియర్ కార్యకర్తల పాదాలను కడిగారు. ఇది భారతీయ సంస్కృతిలో భాగమని పేర్కొన్నారు. సీనియర్లను గౌరవించడం భారతీయ జనతా పార్టీ సంప్రదాయమని అన్నారు. ట్విటర్‌లో వీడియోను పంచుకున్న శర్మ “సీనియర్‌లకు గౌరవం ఇవ్వడం భారతీయ సంస్కృతిలో భాగం. మా పార్టీ సంప్రదాయం కూడా ఇదే. మా సీనియర్ బీజేపీ కార్యకర్తల పాదాలను కడిగినందుకు ఎంతో ఆనందంగా ఉంది, వారి అపారమైన సహకారం మా పార్టీని బలోపేతం చేయడానికి సహాయపడింది.” అని అన్నారు. ఈ వీడియోలో ముఖ్యమంత్రి నేలపై కూర్చొని కార్యకర్తల కాళ్లు కడుగుతూ కనిపించారు. తర్వాత గుడ్డతో వారి పాదాలను తుడిచాడు. గౌహతిలోని బసిస్తాలో కొత్త రాష్ట్ర కార్యాలయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం ప్రారంభించారు. ఈ వేడుకలో అస్సాం సీఎం, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌తో పాటు పలువురు నేతలు కూడా పాల్గొన్నారు.

    Trending Stories

    Related Stories