More

    ముస్లిం సమాజం మెజారిటీగా ఉంది.. ఇకపై మైనారిటీలుగా పరిగణించలేం: సీఎం

    అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ.. అనేక అస్సామీ జిల్లాల్లో హిందువులు నిస్సహాయంగా తక్కువ సంఖ్యలో ఉన్నారని, వారిని మైనారిటీలుగా ప్రకటించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ముస్లిం సమాజం మెజారిటీగా ఉందని, ఇకపై రాష్ట్రంలో మైనారిటీగా పరిగణించలేమని హిమంత బిస్వా శర్మ రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తావించారు. కొన్ని జిల్లాల్లో హిందువులు 5,000 కంటే తక్కువ ఉండడంతో, హిందువులను మైనారిటీలుగా ప్రకటించవచ్చని హిమంత బిస్వా శర్మ అన్నారు.

    సిఎం హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ, “రాష్ట్రంలో హిందువులు మెజారిటీగా లేనప్పుడు మీరు వారిని మైనారిటీలుగా ప్రకటించవచ్చు. జిల్లాలో హిందూ సమాజం మెజారిటీగా లేనప్పుడు.. ఆ జిల్లాలో హిందువులను కూడా మైనారిటీలుగా ప్రకటించాలని నేను భావిస్తున్నాను. అసోంలో హిందువులు మైనారిటీలుగా ఉన్న అనేక జిల్లాలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో 5,000 కంటే తక్కువ మంది హిందువులు కూడా ఉన్నారు. అస్సాంలో ముస్లిం సమాజం మెజారిటీ కలిగి ఉన్న అతిపెద్ద సంఘం. ఇది నా అభిప్రాయం మాత్రమే కాదు.. గణాంకాలు కూడా సూచిస్తూ ఉన్నాయి” అని అన్నారు. అస్సాంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి)ని సమీక్షించాలని సిఎం హిమంత బిస్వా శర్మ డిమాండ్ చేశారు. పాత ఎన్‌ఆర్‌సిని సమీక్షించాలని, మళ్లీ కొత్తగా సమీక్ష చేయాలని గతంలో కూడా చెప్పామని ఆయన అన్నారు. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (AASU)తో మా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో మళ్లీ ఎన్‌ఆర్‌సి అమలు చేయాలని మేము కోరుకుంటున్నామన్నారు.

    అంతకుముందు 15 మార్చి 2022 న, అస్సాం అసెంబ్లీ బడ్జెట్ సెషన్‌లో గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా సిఎం హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ, ముస్లింలు మైనారిటీలు కాదని, రాష్ట్రంలో అతిపెద్ద సమాజంగా మారారని అన్నారు. రాష్ట్రంలో 35% జనాభా ఉన్నందున మతసామరస్యాన్ని నెలకొల్పడం, బ్రాహ్మణులు, గిరిజనుల వంటి మైనారిటీ వర్గాల భయాందోళనలను దూరం చేయడం తమ బాధ్యత అని కూడా సీఎం చెప్పారు. “నేడు ముస్లిం సమాజానికి చెందిన ప్రజలు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా కూడా ఉన్నారు. అధికారాన్ని సొంతం చేసుకోడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి గిరిజనుల హక్కులు రక్షించబడటం, వారి భూములు ఆక్రమించబడకుండా చూడటం మా కర్తవ్యం.” అని అన్నారు.

    హిమంత బిస్వా శర్మ అసెంబ్లీలో జనాభా శాతాన్ని తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ.. “అధికారం బాధ్యతతో వస్తుంది. దాదాపు కోటి జనాభాతో అస్సాం జనాభాలో ముస్లింలు 35 శాతం ఉన్నారు, ముస్లింలు రాష్ట్ర పురోగతిని గ్రహించాలి. పేదరిక నిర్మూలన, జనాభా నియంత్రణ మరియు ఇతర సమస్యలపై దృష్టి సారించడం ద్వారా రాష్ట్ర ప్రజల కష్టాలను తగ్గించడానికి ప్రయత్నించాలి. వారు తమను తాము బయటి వ్యక్తులుగా భావించడం మానేసి, మతపరమైన ఏకీకరణ, సామరస్యంపై దృష్టి పెట్టాలి.” అని పిలుపును ఇచ్చారు.

    Trending Stories

    Related Stories