More

    బిశ్వ శర్మ మార్కు స్కీమ్..! విద్యార్థులంతా ఫిదా..!!

    ఎన్నికలొస్తున్నాయంటే,.. విద్యార్థులకు ల్యాప్ టాప్ లు పంచిన ప్రభుత్వాలను చూశాం. ఓట్ల కోసం,.. విద్యార్థినిలకు సైకిళ్లు పంపిణీ చేసిన సర్కార్లను కూడా చూశాం. కానీ, సమీపంలో ఎన్నికలు లేకపోయినా, ఓట్ల అవసరం లేకపోయినా.. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడమంటే.. కచ్చితంగా స్వాగతించాల్సిన విషయమే. ఇంతకీ, ఇదెక్కడ జరిగింది..? ఈ మంచి పనిని తలపెట్టిన సీఎం ఎవరు..? తెలుసుకునేముందు నేషనలిస్ట్ హబ్ గ్రూపాఫ్ చానెల్స్ ను సబ్ స్క్రయిబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను పూర్తిగా చూసి.. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియోను పదిమందికీ షేర్ చేస్తూ.. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి.

    ఇక, విషయానికి వస్తే.. ఎన్నికలు లేకున్నా విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించిన ఆ రాష్ట్రం అస్సాం. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. హయ్యర్ సెకండరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు స్కూటర్ల పంపిణీ చేయాలని సంకల్పించారు. అనుకున్న వెంటనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అస్సాం హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఖానాపరా వెటర్నరీ కళాశాల క్రీడా స్థలంలో ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ప్రజ్ఞా భారతి పథకం కింద డాక్టర్ బనికాంత కాకతి మెరిట్ అవార్డును.. ఈ ఏడాది 35 వేల 800 మంది విద్యార్థులకు అందజేస్తున్నారు. వీరిలో
    6 వేల 52 మంది బాలురు, 29 వేల 748 మంది బాలికలు ఉన్నారు. అవార్డ్‌కు అర్హత పొందాలంటే,.. అస్సాం హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నిర్వహించే,.. హయ్యర్ సెకండరీ పరీక్ష లో బాలురు కనీసం 75 శాతం మార్కులు సాధించాలి. బాలికలు 60 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. కామరూప్ మెట్రో ఏరియాకు చెందిన,.. అర్హులైన పిల్లలకు తొలుత ఈ స్కూటర్ల పంపిణీని చేపట్టారు. కామరూప్ జిల్లాకు చెందిన అర్హులైన ఇతర విద్యార్థినీ విద్యార్థులకు,.. మిగిలిన విభాగాలకు చెందిన వారికి,.. ఈ నెలాఖరు లోపున స్కూటర్ల పంపిణీ చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సీఎం బిశ్వ శర్మ ప్రకటించారు.

    డాక్టర్ బనికాంత కాకతి మెరిట్ అవార్డుకు అర్హులైన విద్యార్థినీ విద్యార్థులందరినీ,.. సీఎం బిశ్వ శర్మ అభినందించారు. ఇది వారి జీవితంలో చారిత్రాత్మక మైలురాయి అని అన్నారు. విద్యార్థుల అధ్యయనం, అంకితభావం, కృషికి,.. ఇది సమాజం అందించిన దీవెన, బహుమతి అన్నారు. డాక్టర్ బనికాంత కాకతి గురించి ప్రస్తావిస్తూ,.. ఆయన పేరు మీద ఈ అవార్డు ఇవ్వడం సంతోషదాయకం అన్నారు. ఉత్తమ విద్యార్థులు తమ తమ రంగాల్లో ప్రకాశించి,.. రాష్ట్రానికి, దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకొస్తారని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే 25 ఏళ్లను అమృత్‌కాల్‌గా పరిగణించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తిని ఆయన ప్రస్తావించారు. విద్యార్థులు తమ జీవితంలోని ప్రతి క్షణాన్ని దేశాభివృద్ధికి అంకితం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు.. విద్యార్థిలోకం, యువజనులు దేశాభివృద్ధిలో భాగం కావాలని అన్నారు.

    ఆగ్మెంటెడ్ రియాలిటీ,.. వర్చువల్ రియాలిటీ,.. బ్లాక్ చెయిన్,.. క్వాంటం కంప్యూటింగ్,.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‎పై యువత ప్రాథమిక అవగాహన కలిగివుండాలని,.. సీఎం బిశ్వ శర్మ విద్యార్థులకు సూచించారు. అదేవిధంగా బిగ్ డేటా, అడ్వాన్స్‌డ్ జెనోమిక్స్ తదితర ఆధునిక సాంకేతికత పైనా,.. రాష్ట్రానికి చెందిన విద్యార్థినీ విద్యార్థులు, యువజనలు ప్రాథమిక ఆలోచన ఉండాలని అన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల యువత,.. ఇప్పటికే ఈ సాంకేతిక విప్లవంలో ముందంజలో ఉన్నారని గుర్తుచేశారు.

    అంతేకాదు, రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో పోస్ట్-గ్రాడ్యుయేట్ చేసే మహిళలకు,.. ఒక్కొక్కరికి ఏడాదికి పది వేల రూపాయల స్టైఫండ్ అందించాలని,.. సీఎం శర్మ భావిస్తున్నారు. ఇందుకోసం త్వరలో విద్యాశాఖ ప్రారంభించనున్న పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

    Trending Stories

    Related Stories