More

  ఢిల్లీలో అఫ్తాబ్ అస్సాంలో హజ్రత్..! 14 ఏళ్ళ ముస్లిం బాలికపై అఘాయిత్యం, హత్య..!!

  ఢిల్లీ లవ్ జీహాద్ ఘటన మరువక ముందే,.. అస్సాంలో 14 ఏళ్ళ ముస్లిం బాలిక హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. 42 ఏళ్ల హజ్రత్ అలీ అనే వ్యక్తి ముస్లిం మైనర్ బాలికపై అఘాయిత్యం చేయబోయాడు. అయితే అమ్మాయి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కేకలు వేయడంతో దుర్మార్గుడు బాలికను హత్య చేసి చంపివేశాడు. ఈ దారుణ ఘటన అస్సాంలోని ధేకియాజులీ అనే పట్టణంలో చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగే సమయంలో బాధితురాలు, అతడి తండ్రి మాత్రమే ఇంట్లో ఉన్నారు. వేకువజామున నాలుగు గంటలకు బాలిక తండ్రి నమాజ్ కోసం స్థానిక మసీదుకు వెళ్ళాడు. ఇదే అదనుగా భావించిన హజ్రత్ అలీ,.. ఇంట్లోకి ప్రవేశించి బాలికపై అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నించాడు. అలికిడికి మెలుకువ వచ్చిన బాలిక.. హజ్రత్ అలీ ప్రయత్నాన్ని అడ్డుకుంటూ కేకలు వేసింది. దీంతో ఎక్కడ దొరికిపోతానో అని భావించిన దుర్మార్గుడు బాలికను హతమార్చాడు. ఎవరి కంటబడకుండా అక్కడి నుంచి పారిపోయాడు.

  ఇక, నమాజ్ ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన తండ్రి,.. కూతురు చనిపోయి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డాగ్ స్క్వాడ్‎ను పిలిపించి పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ వాసన పసిగట్టి అక్కడే ఉన్న హజ్రత్ అలీ వద్దకు వెళ్ళి ఆగడంతో.. పోలీసులకు నిందితుడిపై అనుమానం వచ్చింది. దీంతో హజ్రత్ అలీని పోలీస్ స్టేషన్‎కు తీసుకెళ్ళి తమదైన శైలిలో విచారించారు. దీంతో నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై అఘాయిత్యం చేయడానికి ప్రయత్నించినట్టు చెప్పుకొచ్చాడు. అయితే ఇందుకు బాలిక ఒప్పుకోకపోవడంతో, ఆమెను హతమార్చినట్లు చెప్పాడు. ఇక ఈ ఘటనపై మీడియా హజ్రత్ అలీని సంప్రదించినప్పుడు కూడా ఇదే విషయాన్ని వివరించాడు.

  ఈ నేపథ్యంలో. నిందితుడిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. పోస్టుమార్టం కోసం బాలిక మృతదేహాన్ని తేజ్ పూర్ మెడికల్ కాలేజీకి తరలించినట్టు స్పష్టం చేశారు. అయితే ఇటువంటి ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో నిందితులపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇటువంటి ఘటనలపై ప్రభుత్వాలు కట్టడి చేయడంతో పాటుగా,.. తల్లిదండ్రులు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరముంది. ఇంట్లో బాలికలను ఒంటరిగా వదిలి వెళ్ళకుండా.. వారికి తోడుగా ఎవరినైనా ఉంచి వెళ్లాలి. పొరుగింటి వారి ప్రవర్తన కారణంగా వారిపై ఒక అంచనాకు వచ్చి.. చెడ్డవారని అనిపిస్తే వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

  ఇక ఢిల్లీ లవ్ జీహాద్ లాంటి సంఘటనల్లో కూడా శ్రద్దా వాల్కర్ తన తల్లిదండ్రులను దూరం చేసుకుంది. దీంతో తనను అఫ్తాబ్ ఏడాది పాటు ఆమెను కొడుతూ హింసిస్తున్నా కూడా ఎవరితోనూ చెప్పుకోలేకపోయింది. ఆ సమయంలో ఆమె తల్లిదండ్రుల తో సన్నిహితంగా మెలగి ఉంటే తన కష్టాలన్నిటినీ చెప్పుకుని అఫ్తాబ్ లాంటి దుర్మార్గుడి చేతిలో బలైపోయి ఉండేది కాదు. అందుకే తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది. వారి రోజువారీ జీవిత విషయాలపై ఓ కన్నేసి ఉంచాలి. వారి ప్రవర్తన, నడవడికలో ఏవైనా తేడాలుంటే దగ్గరికి తీసుకుని సమస్యను కనుక్కునే ప్రయత్నం చేయాలి. లేకపోతే అఫ్తాబ్, హజ్రత్ అలీ లాంటి దుర్మార్గుల చేతిలో బలైపోయే అవకాశాలున్నాయి. ఈ వీడియో నచ్చినట్టయితే పదిమందికీ షేర్ చేయండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానెల్స్ ను సబ్ స్క్రయిబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.

  Trending Stories

  Related Stories