ఆసియా గేమ్స్ లో మొదటి గోల్డ్ సాధించిన భారత్

0
145

ఆసియా క్రీడల్లో భారత్ కు మొదటి స్వర్ణం లభించింది. 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్ విభాగంలో భారత బృందం బంగారు పతకం సాధించింది. రుద్రంక్ష్ బాలాసాహెబ్ పాటిల్, దివ్యాంష్ సింగ్ పన్వార్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ తో కూడిన టీమిండియా ఫైనల్‌లో 1893.7 పాయింట్లు స్కోర్ సాధించింది. గతంలో 1893.3 పాయింట్లతో చైనా పేరిట ఉన్న రికార్డును అధిగమించింది. సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. దక్షిణ కొరియా 1890.1 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా, 1888.2తో చైనా మూడో స్థానంలో నిలిచింది. క్వాలిఫికేషన్‌లో మూడో స్థానంలో నిలిచిన రుద్రాంక్ష్ భారత జట్టు తరఫున 631.6 పాయింట్లు సాధించాడు. భారత్ తరఫున ఐశ్వరీ 631.6 పాయింట్లు నమోదు చేయగా, దివ్యాన్ష్ 629.6 పాయింట్లు సాధించాడు.

భారత్‌కు తొలి స్వర్ణం అందించిన ఎయిర్‌రైఫిల్ జట్టులోని సభ్యులు రుద్రాంక్ష, దివ్యాన్ష్, తోమర్ వ్యక్తిగతంగానూ ఫైనల్‌కు చేరుకున్నారు. ఫైనల్ కోసం జరిగిన పోటీల్లో రుద్రాంక్ష మూడో స్థానం, తోమర్ ఐదో స్థానం, దివ్యాన్ష్ ఎనిమిదో స్థానం కైవసం చేసుకున్నారు. టీమ్ ఈవెంట్‌లో భారత్ స్వర్ణ పతకాన్ని సాధించడమే కాకుండా, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో ముగ్గురు షూటర్లు టాప్-8కి అర్హత సాధించారు. ఆసియా క్రీడల నిబంధనల ప్రకారం, ప్రతి దేశం నుండి ఇద్దరు మాత్రమే ఫైనల్‌కు అర్హత సాధించగలరు. దీని కారణంగా రుద్రంక్ష్, ఐశ్వరీ ఫైనల్‌కు చేరుకున్నారు.. దివ్యాన్ష్ తప్పుకున్నట్లు తెలిపాడు.