More

    చిత్తూరులో దొంగతనం చేసి దొరికిపోయిన ఏఎస్ఐ మహమ్మద్‌ గుండెపోటుతో మృతి

    ‘పోలీసులే దొంగలు’ అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతమైన వైరల్ అయిన సంగతి తెలిసిందే..! చిత్తూరులోని విజయ డెయిరీ సమీపంలో తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి రోడ్డు పక్కన చిన్నపాటి వస్త్రదుకాణం పెట్టుకున్నాడు. రాత్రి మూసేసి మరుసటి రోజు దుకాణాన్ని తెరిచేవాడు. కొద్ది రోజుల క్రితం యూనిఫాం ధరించిన ఓ కానిస్టేబుల్, సివిల్‌ డ్రెస్‌లో ఉన్న మరో వ్యక్తి అర్ధరాత్రి దుకాణం వద్దకు వెళ్లి రెండు బండిళ్ల బట్టలను చోరీ చేశారు.మరుసటి రోజు దుకాణం వద్దకు వచ్చిన దుకాణదారుడు చోరీ అయిన విషయాన్ని గ్రహించి పక్కనే ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించాడు. పోలీసులే చోరీ చేసినట్లు గుర్తించాడు.

    రోజూ పని ముగించుకున్న అనంతరం.. దుస్తులు అన్నీ మూటగట్టి.. తాడుతో కట్టి వెళ్లేవాడు. మరుసటిరోజు వచ్చి చూసేసరికి స్టాక్ తక్కువగా ఉందని అనిపించింది. సీసీటీవీ కెమెరాల్లో మొత్తం దొంగతనం బయటపడింది. కానిస్టేబుల్‌, మరో వ్యక్తి దొంగతనం చేయడం స్పష్టంగా కనిపించింది. కానిస్టేబుల్ తో పాటు సివిల్ డ్రెస్‌లో ఏఎస్‌ఐ కూడా అక్కడే ఉండి ఈ దొంగతనం చేశారు. ద్విచక్ర వాహనంలో వచ్చినవారిలో ఒకరు కానిస్టేబుల్ కాగా, సాధారణ దుస్తుల్లో మరో వ్యక్తి ఏఎస్ఐ మహమ్మద్‌గా గుర్తించి సస్పెండ్ చేశారు పోలీసు అధికారులు.

    రిమాండ్ ఖైదీగా ఉన్న ఏఎస్ఐ మహమ్మద్ గుండెపోటుతో ప్రాణాలను వదిలాడు. ఎస్పీ అదేశాల మేరకు దొంగతనం కేసులో ఇరువురిని సస్పెండ్ చేసి, చిత్తూరు జిల్లా జైలులో రిమాండ్‌కు తరలించారు. బుధవారం జైలులో మహమ్మద్‌కు గుండెపోటు రావడంతో జైలు అధికారులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహమ్మద్ మృతి చెందారు. ఈ విషయం బయటకు రాకుండా చేయడానికి మొదట పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఆ తర్వాత బయటకు రావడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు.

    Related Stories