National

విచారణకు హాజరైన ఆశిష్ మిశ్రా.. కాన్వాయ్ లోగానీ, కారులో గానీ లేను

యూపీలోని లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర స‌హాయ‌ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఆయన పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు. ఈ రోజు కూడా విచార‌ణ‌కు రాక‌పోతే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సిట్ అధికారులు హెచ్చ‌రించారు. దీంతో ఆయ‌న విచార‌ణ‌కు వ‌చ్చారు. విచారణ కోసం క్రైం బ్రాంచ్ ఆఫీస్‌ లోప‌లికి వెళ్లారు. ఈ కేసులో ఆశిష్ మిశ్రాను ప్రస్తుతం అధికారులు ప్ర‌శ్నిస్తున్నారు.

ఆశిష్ మిశ్రా పోలీసుల విచారణలో కీలక విషయాలను వెల్లడించారు. లఖింపూర్ ఖేరిలో రైతుల మీదకు కారు దూసుకెళ్లినప్పుడు తాను ఆ కాన్వాయ్ లోగానీ, కారులో గానీ లేనని క్రైం బ్రాంచ్ పోలీసులకు స్పష్టం చేశారు. ఆ సమయంలో తాను దంగల్ లో ఉన్నానని.. దానికి సంబంధించిన వీడియోలను పోలీసులకు అందజేశారు. దాంతో పాటు పది మంది సాక్షుల వాంగ్మూలాలనూ దానికి జత చేశారు. డీఐజీ ఉపేంద్ర అగర్వాల్ నేతృత్వంలోని సిట్ ఆశిష్ ను విచారించింది.

అరెస్టుల అంశంపై కీలక వ్యాఖ్యలు చేసిన యోగి ఆదిత్యనాథ్:

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య‌నాథ్ అరెస్టుల గురించి వివ‌ర‌ణ ఇచ్చారు. తాము ఎలాంటి ఆధారాలు లేకుండా ఎవ‌ర్నీ అరెస్టు చేయ‌బోమ‌ని.. చ‌ట్టం ముందు ప్ర‌తి ఒక్క‌రూ స‌మాన‌మే అని ఆయ‌న అన్నారు. సుప్రీంకోర్టు కూడా ఈ విష‌యాన్నే స్ప‌ష్టం చేస్తోంద‌ని తెలిపారు. ల‌ఖింపూర్ ఘ‌ట‌న‌లో ద‌ర్యాప్తు జ‌రుగుతోంద‌ని అన్నారు. ఇప్ప‌టికే లిఖితపూర్వ‌క ఫిర్యాదు అందిందని, దాని ఆధారంగా ఎఫ్ఐఆర్ న‌మోదు చేశామ‌ని అన్నారు. ఎవ‌ర్నీ వ‌దిలిపెట్టబోమ‌ని చెప్పుకొచ్చారు. తాము ఎవ‌రికీ అన్యాయం చేయ‌బోమ‌న్నారు. విప‌క్షాలు చేస్తోన్న ఒత్తిడిలో ఎటువంటి చ‌ర్య‌లు చేప‌ట్ట‌బోమ‌ని అన్నారు. ప్ర‌జాస్వామ్యంలో హింస‌కు చోటు లేద‌ని.. చ‌ట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

Related Articles

Back to top button