దిశ మార్చుకున్న అసని.. రెడ్ అలర్ట్ జారీ

0
716

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అసని’ తుపాను అనూహ్యంగా దిశ మార్చుకుంది. వాయవ్య దిశకు పయనిస్తుందని ముందు అనుకున్నా.. ఇప్పుడా తుపాను ఆగ్నేయ దిక్కుకు మళ్లింది. పూర్తిగా బలహీనపడే వరకు అది తీరం వెంబడే పయనిస్తుందని.. కోస్తాంధ్ర తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. నర్సాపురానికి 30 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని.. నర్సాపురం తీరానికి దిగువన అల్లవరానికి సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ప్రస్తుతం 6 కిలోమీటర్ల వేగంతో తుపాను కదులుతున్నట్టు తెలిపింది. తీరాన్ని తాకిన తర్వాత సాయంత్రం యానాం వద్ద తిరిగి సముద్రంలోకి తుపాను ప్రవేశించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆ తర్వాత క్రమంగా తుపాను వాయుగుండంగా బలహీనపడుతుందని అంచనా వేసింది.

ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఏపీ ప్రభుత్వం అధికారులకు పలు సూచనలు చేసింది.ఏపీలోని మ‌చిలీప‌ట్నం, కాకినాడ‌, విశాఖ‌, గంగ‌వ‌రం, భీమునిప‌ట్నం పోర్టుల్లో 7వ నెంబ‌ర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మిగిలిన పోర్టుల్లో 5 వ నెంబ‌ర్ హెచ్చరికలను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

తుపాను నేప‌థ్యంలో కొన్ని ప్రాంతాల్లో అధికారులు కంట్రోల్ రూమ్‌ల‌ను ఏర్పాటు చేశారు.
శ్రీకాకుళం 08942-240557,
విజయనగరం కలెక్టరేట్-08922-236947, 08922-276888,
చీపురుపల్లి-9440717534,
భోగాపురం-8074400947,
విశాఖ-0891-2590100, 2590102
ఒంగోలు కలెక్టరేట్ కంట్రోల్ రూం నంబర్ : 1077,
పోలీస్ వాట్సప్ నంబర్ : 9121102266,
పార్వతీపురం మన్యం: 7286881293