కోవిడ్ టీకాలపై గతంలో కొంత విమర్శనాత్మక ధోరణిలో వ్యవహరించిన ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు. అంతే కాకుండా వ్యాక్సిన్ ప్రాధాన్యతను కూడా తెలుపుతూ ట్వీట్ చేశారు.
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసిన వేళ.. 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు, 45ఏళ్లు దాటి వివిధ వ్యాదులతో బాధపడేవాళ్లతో పాటు ప్రజాప్రతినిధులు, కొవిడ్ వారియర్లకు తొలి ప్రధాన్యతగా టీకాల పంపిణీ కొనసాగుతున్నది. ఈ క్రమంలో కోవిడ్ టీకాలపై గతంలో కొంత విమర్శనాత్మక ధోరణిలో వ్యవహరించిన ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు. అంతే కాకుండా వ్యాక్సిన్ ప్రాధాన్యతను కూడా తెలుపుతూ ట్వీట్ చేశారు.
Alhamdulilah took the first dose of #vaccine today. Vaccination not only helps protect oneself from #COVIDー19 but also reduces risk for all. I urge everyone eligible to schedule an appointment at the earliest & get themselves vaccinated. May Allah protect us from the pandemic pic.twitter.com/9CjHMVn2Ji
— Asaduddin Owaisi (@asadowaisi) March 22, 2021
అసదుద్దీన్ ఓవైసీ సోమవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కొవిషీల్డ్ టీకా తొలి డోసు వేయించుకున్నారు. టీకా తీసుకున్నట్లు తన ట్విట్టర్‌లో పోస్టు పెట్టిన ఆయన.. వ్యాక్సిన్ వల్ల మనల్ని మనం కాపాడుకోవడంతోపాటు ఇతరులకూ ప్రమాదాన్ని తగ్గించినవాళ్లమవుతామని, అర్హులైన ప్రతి ఒక్కరూ వెంటనే షెడ్యూల్ రూపొందించుకుని, టీకాలను పొందాలని ఓవైసీ కోరారు. మహమ్మారి నుంచి భగవంతుడు మనల్ని కాపాడుతాడని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించిన లెక్కల ప్రకారం ఇప్పటిదాకా దేశంలో 4.5 కోట్ల మంది కోవిడ్ టీకా తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ సహా తెలంగాణ అంతటా కొవిడ్-19 పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతోన్న నేపథ్యంలో రాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది. మళ్లీ లాక్ డౌన్ విధిస్తారంటూ ప్రచారం జరుగుతుండగా, వైద్య శాఖ అధికారి శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్, కర్ఫ్యూ ప్రపోజల్ లేదన్నారు. విద్యాసంస్థల్లో కేసులు వస్తున్నాయని, విద్యార్థుల ద్వారా ఇంట్లోని వృద్ధులు.. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ప్రమాదమని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.