More

  హైదరాబాద్ ప్రశాంతంగా ఉండడం బీజేపీకి నచ్చడం లేదు: అసదుద్దీన్

  మహ్మద్ ప్రవక్తపై భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాసనసభ సభ్యుడు (ఎమ్మెల్యే) రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. దేశాన్ని నాశనం చేయడానికి బీజేపీ చేస్తున్న ఉద్దేశపూర్వక ప్రయత్నమని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండిస్తున్నానని.. హైదరాబాద్‌లో శాంతిని చూడాలని బీజేపీ కోరుకోవడం లేదన్నారు. బీజేపీ నేతలు ప్రవక్త ముహమ్మద్‌ను, ముస్లింలను ద్వేషిస్తారు. భారతదేశ సామాజిక వ్యవస్థను నాశనం చేయాలని చూస్తున్నారన్నారు. ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ చాలా ప్రశాంతంగా ఉందని… ఈ శాంతియుత వాతావరణాన్ని బీజేపీ సహించలేకపోతోందని అన్నారు. బీజేపీ మన దేశంలో ఉన్న సామాజిక భిన్నత్వాన్ని నాశనం చేయాలనుకుంటోందని చెప్పారు. తమతో పోరాటం చేయాలనుకుంటే రాజకీయపరమైన పోరాటం చేశాలని… ఇలా కాదు అని అన్నారు. రాజా సింగ్ పై కేసు నమోదు చేయాలని.. అతడి వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించాలని.. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

  రాజా సింగ్‌కు వ్యతిరేకంగా హైదరాబాద్ లో నిరసనకారులు చేస్తున్న ‘సర్ తన్ సే జుదా’ నినాదాలను కూడా AIMIM చీఫ్ ఖండించారు. ఆ నినాదాలను కూడా ఖండిస్తున్నాను.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని వారితో చెబుతానని ఆయన అన్నారు. సౌత్, ఈస్ట్, వెస్ట్ జోన్‌ల పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో రాజా సింగ్‌పై ఫిర్యాదులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

  spot_img

  Trending Stories

  Related Stories