More

    మరోసారి అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు

    లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం మహారాష్ట్రలోని భివాండీలో ప్రసంగిస్తూ తాజ్ మహల్ కింద పీఎం డిగ్రీ కోసం వెతుకుతున్నారని ఆయన అన్నారు. ఇక భారతదేశం వెలుపల నుండి మొఘలులు ఎలా వచ్చారో బీజేపీ చెబుతూనే ఉంటుంది, అయితే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అనేక ఇతర సమూహాలు కూడా భారత్ లో అలాగే ఉన్నారని అన్నారు. ద్రావిడులు, ఆదివాసీలు మాత్రమే భారతదేశానికి చెందిన వారని అన్నారు. భారత్ తనదీ, మోదీ–షాలదిగానీ, థాక్రేలదిగానీ కాదని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ దేశం ద్రవిడియన్లు, ఆదివాసీలదని అన్నారు. ఆఫ్రికా, మధ్య ఆసియా, ఇరాన్, తూర్పు ఆసియా నుంచి వలస వచ్చిన వారితోనే భారత్ ఏర్పడిందన్నారు. దేశంలోకి మొఘలులు వచ్చాకే ఆర్ఎస్ఎస్–బీజేపీ వచ్చాయన్నారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పైనా ఆయన ఫైర్ అయ్యారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విషయంలో సీబీఐ, ఈడీలు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రధాని మోదీని కలిసినట్టే.. ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ విషయంలో కూడా ఎందుకు కలవలేదని నిలదీశారు. నవాబ్ మాలిక్ ముస్లిం అనే కలవలేదా? అని ప్రశ్నించారు. రెండు వారాల క్రితం తాజ్ మహల్ వివాదం హెడ్ లైన్స్ లో నిలిచిన సంగతి తెలిసిందే..! ఆగ్రాలోని తాజ్‌మహల్‌లో తాళం వేసి ఉన్న 22 గదుల వెనుక ఉన్న నిజాలు కనుక్కోవాలని పిటిషన్ దాఖలు చేశారు.మే 12న, అలహాబాద్ హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది.

    Trending Stories

    Related Stories