జైలు నుండి విడుదలైన ఆర్యన్ ఖాన్.. ట్విట్టర్ లో ఏమని ట్రెండ్ చేస్తున్నారంటే

బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి బెయిల్ పై విడుదల అయ్యాడు. ఆర్యన్ ను జైలు నుంచి రిసీవ్ చేసుకోవడానికి పెద్ద సంఖ్యలో షారుఖ్ బృందం జైలు వద్దకు వచ్చింది. గురువారం నాడు ఆర్యన్ కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అదే రోజు బెయిల్ ఆర్డర్ ను విడుదల చేయలేదు. బెయిల్ వచ్చినప్పటికీ రెండు రాత్రులు ఆర్యన్ జైల్లోనే గడిపాడు. నిన్న సాయంత్రం 5.30 గంటల్లోగా బెయిల్ పేపర్లను సమర్పించడంలో ఆర్యన్ లీగల్ టీమ్ విఫలమయింది. శుక్రవారం రాత్రి కూడా ఆర్యన్ జైల్లోనే గడిపాడు. ఈరోజు ఉదయం ఆర్యన్ బయటకు వచ్చాడు. మరోవైపు ఆర్యన్ విడుదల నేపథ్యంలో షారుఖ్ ఇంటి వద్దకు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఆ ప్రాంతమంతా చాలా హడావుడి నెలకొంది.
ఆర్యన్ ఖాన్ విడుదలపై ట్విట్టర్ లో ట్రెండింగ్ చేస్తున్నారు. #WelcomeHomeNashedi అంటూ ఆర్యన్ ఖాన్ విడుదలపై పోస్టులు పెడుతూ వస్తున్నారు. ఆర్యన్‌తోపాటు మరో ఇద్దరు నిందితులు ఆర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలకు కూడా బెయిల్ లభించింది. కోర్టు నుంచి ఆర్డర్స్ అందగానే సంబంధిత ప్రొసీజర్‌ను పూర్తిచేసి ఇవాళ ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలను జైలు నుంచి విడుదల చేశారు. క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ ఈ నెల 2న ఎన్సీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఆర్యన్ ఖాన్‌తోపాటు మరికొంత మందిని కూడా అప్పట్లో అదుపులోకి తీసుకున్నారు. ఎన్సీబీ అధికారులు విచారణ అనంతరం ఈ నెల 8న ఆర్యన్ జైలుకు వెళ్లాడు.
ఆర్యన్ విడుదలపై రామ్ గోపాల్ వర్మ పలు వ్యాఖ్యలు చేశారు. ‘సాధారణంగా ప్రతి దీపావళికి ఖాన్ల విడుదల(ఖాన్ హీరోల సినిమాల విడుదల) ఉంటుంది. ఈ దీపావళికి కూడా ఖాన్ విడుదలయ్యాడు’ అని ఆయన సెటైర్ వేశారు.