గత ఏడాది అక్టోబర్‌లో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ జోనల్ హెడ్ సమీర్ వాంఖడే నేతృత్వంలోని బృందం కార్డెలియా క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ ను పట్టుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ విచారణలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) విజిలెన్స్ విభాగం అక్రమాలను కనుగొంది. కేసు దర్యాప్తులో అనేక అక్రమాలను గుర్తించడమే కాకుండా.. సుమారు ఎనిమిది మంది అధికారుల ప్రవర్తన అనుమానంగా ఉందని గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆర్యన్ ఖాన్ తో పాటు, 8 మంది అధికారులపై 3వేల పేజీల ఛార్జిషీట్ ను ఎన్‌సిబి అధికారులు సిద్ధం చేశారు.
కార్డెలియా క్రూయిజ్ షిప్ కేసులో ఆర్యన్ ఖాన్‌తో పాటు మరో 15 మందిని 2021 అక్టోబర్ 3న ఎన్‌సిబి అరెస్టు చేసింది. కొన్ని వారాల పాటు ఆర్యన్ జైలులో గడిపాడు. ఆర్యన్ ఖాన్ కేసు దర్యాప్తులో అధికారులు అనుచితంగా వ్యవహరించారనే ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం తన విజిలెన్స్ నివేదికను ఢిల్లీలోని ప్రధాన కార్యాయానికి అందించింది. దీనిలో 65 మంది వాంగ్మూలాలు రికార్డు చేసుకోగా, కొందరు మూడు నుంచి నాలుగు సార్లు వాంగ్మూలాలు మార్చినట్లు పేర్కొంది. ఈ కేసులో అనుమానాస్పదంగా వ్యవహించిన అధికారుల పై చర్యలు తీసుకునేందుకు సీనియర్ల నుంచి అనుమతి రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. అక్టోబర్ 2, 2021న, వాంఖడే, NCB అధికారుల బృందం క్రూయిజ్ షిప్ కార్డెలియాపై దాడి చేసింది.. పలువురిని అరెస్టు చేసింది.. 28 రోజులు ఆర్యన్ ఖాన్ జైలులో గడిపాడు. మేలో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC), వాంఖడేను చెన్నైలోని పన్ను చెల్లింపుదారుల సేవల డైరెక్టర్ జనరల్ (DGTS) కార్యాలయానికి బదిలీ చేసింది.
ఆర్యన్ ఖాన్ నుండి డబ్బు వసూలు చేయడానికి వాంఖడే బృందం ప్రయత్నించినట్లు ఆరోపణలు రావడంతో డీడీజీ సంజయ్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మొత్తం కేసుపై విచారణ జరిపింది.