More

    ఆర్యన్ ఖాన్ కు మరో షాక్

    బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు మరోసారి నిరాశ ఎదురైంది. మాదక ద్రవ్యాల కేసులో ఆర్యన్‌ ఖాన్‌ పెట్టుకున్న బెయిలు పిటీషన్ ను ముంబై స్పెషల్ కోర్టు బుధవారం నాడు తోసిపుచ్చింది. గురువారం వరకూ ఆర్యన్‌ను జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్చింది.ఆర్యన్‌తో పాటు అర్బాజ్ మర్చెంట్, మున్‌మున్ ధమేఛా బెయిల్ దరఖాస్తులను కూడా కోర్టు నిరాకరించింది.

    అక్టోబర్ 2న ఆర్యన్, అర్బాజ్‌ సహా ఏడుగురిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆర్యన్ ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్నాడు. అప్పటి నుండి ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. డ్రగ్స్ కేసులో ఆర్యన్ ను ఎన్సీబీ అధికారులు అక్టోబర్ 3న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 8 నుంచి ఆర్యన్ ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లో ఉన్నాడు. ఆర్యన్ వద్ద డ్రగ్స్ దొరకలేదని ఆయన తరపు న్యాయవాదులు చేసిన వాదనను కోర్టు పట్టించుకోలేదు. ఇక ఓ వర్ధమాన నటితో ఆర్యన్ వాట్సాప్ లో డ్రగ్స్ గురించి చేసిన సంభాషణను కోర్టుకు ఎన్సీబీ అందించింది. ఇక బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆర్యన్ తరపు లాయర్లు ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    Related Stories