More

    నాకు డ్రగ్స్ తీసుకోవడం అలవాటు: ఆర్యన్ ఖాన్

    డ్రగ్స్ కేసులో ఇటీవలే క్లీన్‌చిట్ పొందిన బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ పుత్ర రత్నం ఆర్యన్ ఖాన్ మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ (NCB) ఎదుట కీలక విషయాలను బయటపెట్టాడు. ఆర్యన్ అమెరికాలో ఉండగానే గంజాయి తాగడాన్ని అలవాటు చేసుకున్నాడని, ఈ విషయాన్ని స్వయంగా తమతో చెప్పాడని 6 వేల పేజీల చార్జ్‌షీట్‌లో పేర్కొంది. నిద్ర సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కోసమే గంజాయి తీసుకునేవాడినని చెప్పాడని ఎన్సీబీ పేర్కొంది. క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ కేసులో చిక్కిన ఆర్యన్ ఖాన్‌ సహా మరో ఐదుగురికి ఇటీవల ఎన్‌సీబీ క్లీన్ చిట్ ఇచ్చింది. మరో 14 మందిపై మాత్రం 6 వేల పేజీల చార్జ్‌షీట్ తయారుచేసింది. ఆర్యన్ ఖాన్ 2018లో అమెరికాలో గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడే గంజాయి అలవాటు చేసుకున్నాడు. నిద్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆర్యన్ గంజాయి తాగడం ద్వారా వాటి నుంచి బయటపడొచ్చని ఇంటర్నెట్‌ ద్వారా తెలుసుకున్నాక దానికి అలవాటు చేసుకున్నాడట. ముంబైకి చెందిన ఓ డ్రగ్ డీలర్ తనకు తెలుసని, కానీ అతడి వివరాలు తనకు తెలియదని ఆర్యన్ పేర్కొన్నాడు.

    Trending Stories

    Related Stories