More

  చైనాకు భారత్ కారి‘ఢర్’..! కాలు కదిపితే అంతే..!!

  చైనాకు సరిహద్దుల్లో వున్న భారత ప్రాంతాలను కలిపేందుకు, రహదారి కనెక్టివిటీని మెరుగు పర్చేందుకు కేంద్రం ఎన్నో చర్యలు చేపడ్తోంది. జాతీయ రహదారి 15, అరుణాచల్ ప్రదేశ్‎లో ఫ్రాంటియర్ హైవేలకు కేంద్రం పచ్చజెండా ఊపింది. అరుణాచల్ ప్రదేశ్‌లో 2,178 కిలోమీటర్ల మేర ఆరు కారిడార్లను నిర్మించాలని కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. సరిహద్దుల వరకు మూడు కీలక రహదారులను విస్తరించనున్నారు.

  సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచిపోషిస్తున్న చైనాకు చెక్ పెట్టేందుకు.. భారత్ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‎లో ఆరు కారిడార్ల నిర్మాణానికి కేంద్ర సర్కారు అనుమతి ఇచ్చింది. చైనా సరిహద్దుకు సమీపంలో అరుణాచల్ ప్రదేశ్ వుండడంతో, ఈ రాష్ట్రంపై చైనా దురాలోచనలు సాగించడం మొదలెట్టింది. చైనా దుష్టాలోచన ఎంత వరకు వెళ్లిందంటే.. సరిహద్దు ప్రాంతంలో రోడ్డు, ఎయిర్ బేసులు, ఎయిర్ స్ట్రిప్ లు నిర్మించే వరకు వెళ్లింది. గల్వాన్ ఘర్షణల అనంతరం చైనా తన సైనిక నిర్మాణాలను పెంచేస్తోంది. అక్రమార్కపర్వాలకు పాల్పడాలని చైనా విక్రమార్క ప్రయత్నాలు చేస్తే.. భారత్ ఏమైనా చేతులు కట్టుకుని కూర్చుంటుందా..! చైనాకు కళ్లు బైర్లు కమ్మేలా ప్రతి చర్యలకు దిగింది. అరుణాచల్ ప్రదేశ్ మొదలుకుని చైనాతో సరిహద్దు పంచుకుంటున్న భారతదేశ రాష్ట్రాల్లో రోడ్లు, వంతెనలను వేగవంతంగా నిర్మిస్తోంది.

  ఇటాఖోలా-సీజోసా-పక్కే కెస్సాండ్-సెప్పా, చయాంగ్తాజో, సాంగ్గ్రామ్ పార్సీ పార్లో వరకు 391 కిలోమీటర్ల మేర ఒక కారిడార్ నిర్మించనున్నారు. కనుబారి, లాంగ్డింగ్ వరకు 404 కిలో మీటర్ల వరకు రెండో రహదారిని నిర్మించనున్నారు. అకాజాన్ పాంగో జార్జింగ్ మధ్య 398 కిలోమీటర్ల మేర మూడో కారిడార్ నిర్మించనున్నారు. అదేవిధంగా, గోగముఖ్ తహిలా టాటో వరకు 285 కిలోమీటర్ల మేర నాలుగో రహదారి చేపట్టనున్నారు. ఇక, తెలమార తవాంగ్ నీలియా సరిహద్దు వరకు 402 కిలోమీటర్ల మేర అయిదో రహదారి, పాసిఘాట్ బిషింగ్ సరిహద్దు వరకు 298 కిలో మీటర్ల మేర ఆరో కారిడార్ ను అభివృద్ది చేయనున్నారు. ఈ రోడ్ల ద్వారా సైనిక సామగ్రిని వేగంగా చైనా సరిహద్దుల్లో మోహరించే అవకాశం ఏర్పడుతుంది. గత ఐదేళ్లలో 15 వేల 477 కోట్ల రూపాయల వ్యయంతో చైనా సరిహద్దు ప్రాంతాల్లో 2,088 కిలోమీటర్ల రోడ్లను భారత్ నిర్మించిందని రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ ఈ ఏడాది జూలైలో వెల్లడించారు.

  తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అంటారు. చైనా తంతు ఇలాగే వుంది. పిచ్చిచేష్టాలు తాను ప్రారంభించి, రోడ్డు, ఎయిర్ బేసులు, ఎయిర్ స్ట్రిప్ లను ఇష్టానుసారం చేపట్టి, కయ్యానికి కాలుదువ్విన డ్రాగన్ కంట్రీ, ఇప్పుడు నెత్తీ నోరు బాదుకుంటోంది. అరుణాచల్ ప్రదేశ్, లడక్ తదితర ప్రాంతాల్లో భారత్ చేపట్టిన నిర్మాణాలపై అక్కసు వెళ్లగక్కుతోంది. సభ్యత మర్చిన దేశం ఇప్పుడు అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. చైనా బోర్డర్‌ సమీపంలో అరుణాచల్‌లో 6 కారిడార్ల నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇవ్వడం శుభపరిణామం. కారణం లేకుండా కయ్యానికి దిగే కుక్క తోక వంకర దేశాలకు, తోక జాడించే దేశాలకు బుద్ధి చెప్పడంలో భారత్ ముందు వరసలో వుంటుందని మరోసారి నిరూపితం అయ్యింది.

  అందరితోనూ మిత్రత్వాన్ని కాంక్షించే భారత్ మంచితనాన్ని కొన్ని దేశాలు అలుసుగా తీసుకుని శతృత్వం వహిస్తున్నాయి. అన్యాయంగా భూభాగాలు కాజేయాలని దుష్టపన్నాగాలు పన్నుతున్నాయి. మంచిగా వుంటే స్నేహ హస్తం అందించే భారత్, చెడ్డగా ప్రవర్తిస్తే బుద్ధి చెప్పడంలోనూ ముందంజలోనే వుంటుంది. ఈ విషయం గతంలో ఎన్నోసార్లు రూఢీ అయ్యింది. ఎవరు ఏవిధంగా అనుకున్నా…ఉధ్రిక్తల సమయంలో సైన్యాన్ని, ఆయుధ వ్యవస్థలను వేగంగా తరలించేందుకే రోడ్లను నిర్మిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ మొదలుకుని చైనాతో సరిహద్దు పంచుకుంటున్నభారత రాష్టాల్లో రోడ్లు, వంతెనలను నిర్మాణాలను వేగవంతంగా నిర్మిస్తోంది.

  Trending Stories

  Related Stories