ఐఎస్ఐకి చైనా ఆయుధాలు..!

Sep 26, Sat 2020 08:55 PM In Focus

-- పాకిస్తాన్ సపోర్ట్ తో ఆయుధాలు అందిస్తున్న డ్రాగన్
-- జమ్మూ కశ్మీర్ లో ఉగ్రచర్యల్ని చైనా పెంచడమే లక్ష్యం..!
-- కేంద్ర ప్రభుత్వానికి ఇంటలిజెన్స్ నివేదిక

సరిహద్దుల్లో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనాకు భారత్ దిమ్మదిరిగే షాకులు ఇస్తూనేవుంది. అటు దౌత్యపరంగా కూడా డ్రాగన్ కు హెచ్చరిస్తోంది. దీంతో ఎటూ పాలుపోని బీజింగ్ పార్టీ.. తన ఉగ్రమిత్రుడైన పాకిస్తాన్ ను ఎగదోసే పనిలో పడింది. జ‌మ్మూ క‌శ్మీర్‌లో ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌ను పెంచడానికి కుయుక్తులు ప‌న్నుతోంది. ఓవైపు భారత్ తో యుద్ధం కోరుకోవడం లేదంటూ నీతివ్యాఖ్యాలు వల్లిస్తూనే.. మరోవైపు గోతులు తవ్వుతోంది. ముందుండి ధైర్యంగా పోరాడే శక్తిలేని డ్రాగన్.. శత్రుమూకలనే కాదు.. ఆయుధాలను కూడా భారత్ పైకి ఎగదోస్తోంది. లద్దాఖ్‌ సరిహద్దు వద్దల్లో ఉద్రిక్తతలు పెంచి, అశాంతిని రెచ్చగొట్టడానికి పాకిస్తాన్‌తో కలిసి కుట్రలు పన్నుతున్నట్టు ఇంటలిజెన్స్‌ వర్గాలు గుర్తించాయి.

జమ్మూ కశ్మీర్‌లో పెద్ద ఎత్తును ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలను మోహరించాలని.. పాకిస్తాన్ కు ఆదేశాలు జారీచేసినట్టు తెలుస్తోంది. జమ్మూకు పెద్ద ఎత్తును ఆయుధాలు తరలించాలనే ప్రణాళికను అమలు చేయాలని డ్రాగన్‌ దేశం పాక్‌కి సూచించిందని కేంద్ర ప్రభుత్వానికి ఇంటలిజెన్స్‌ వర్గాలు నివేదికలు అందించాయి. ఇటీవల భద్రతా ధళాలు స్వాధీనం చేసుకున్న ఆయుధాల ద్వారా.. భారత్‌లో హింస, ఆశాంతిని పెంచడానికి చైనా పాకిస్తాన్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐకి ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ ఆయుధాలపై చైనా దేశానికి సంబంధించిన గుర్తులు ఉన్నట్లు గుర్తించారు.

ఇటీవల జమ్మూ నుంచి దక్షిణ కశ్మీర్‌కు కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అనుమానితులను భద్రతా దళాలు అరెస్టు చేశారు. వారి వద్ద చైనా గుర్తులు ఉన్న నోరిన్కో E.M.E.I. TYPE 97 N.S.R. Riffle, 190 రౌండ్లతో నాలుగు మ్యాగజైన్స్, 21 A రౌండ్లు, మూడు గ్రెనేడ్లతో నాలుగు మ్యాగజైన్స్ కలిగిన ఏకే 47 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో భారత భద్రతా బలగాలు సరిహద్దు వద్ద అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. దీంతో భారత భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.

నిజానికి, జ‌మ్మూ క‌శ్మీర్‌ను కేంద్ర‌పాలిత ప్రాంతంగా చేసిన త‌ర్వాత.. ప్ర‌భుత్వం ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌ను అడ్డుకోవ‌డంపై దృష్టిసారించింది. ఇందులోభాగంగా చొరబాట్లకు వీల్లేకుండా భ‌ద్ర‌తాబ‌ల‌గాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. దీంతో ఉగ్రవాదులను కానీ, ఆయుధాలను కానీ కశ్మీర్లోకి పంపించడం పాకిస్తాన్‌కు క‌ష్టంగా మారింది. అయితే దాంతో పరిస్థితుల్లో శీతాకాలం మొద‌ల‌య్యేనాటికి సాధ్యమైనంతవ‌ర‌కు ఉగ్రవాదులను, ఆయుధాలను లోయలోకి పంపించాలని ఐఎస్‌ఐ భావిస్తున్నట్టు నిఘావర్గాలు వెల్లడించాయి. ఈ క్ర‌మంలో స‌రిహ‌ద్దుల్లో డ్రోన్ల‌ద్వారా, పైపుల్లో ఆయుధాలను అక్ర‌మంగా చేర‌వేస్తున్నారు.

అంతేకాదు, ఐఎస్ఐ స్థానికంగా రిక్రూట్ మెంట్లను పెంచినట్టు తెలుస్తోంది. గత రెండు నెలల్లో ఐఎస్ఐ లోకి భారీగా చేరికలు జరిగినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. వీరికోసం ఆయుధాల సప్లై కూడా పెంచినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఐఎస్ఐ డ్రోన్ల ద్వారా కశ్మీర్ లోకి ఆయుధాలు జారవిడుస్తున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. అటు సీపెక్ ను రక్షించేనేందుకు చైనా ఐఎస్ఐకి భారీగా ఆయుధాలు అందిస్తోంది.

ఇంటలిజెన్స్‌ నివేదికలు వెలువడిన నేపథ్యంలో భారత భద్రతా దళాలు నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు నిరోధక గ్రిడ్‌ను మరింత బలోపేతం చేశాయి. జమ్మూ కశ్మీర్ లో పర్యటించిన బీఎస్ఎఫ్ చీఫ్ రాకేశ్ అస్థానా, సీఆర్పీఎఫ్ చీఫ్ ఏపీ మహేశ్వరి, భద్రతా బలగాలు.. గత పది రోజుల నుంచి చోటుచేసున్న పరిస్థితులను సమీక్షించి.. ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆర్మీ చీఫ్ ఎంఎం నారావణే ఆదేశించారు.

#ChinaWeapons #Pakistan #Isi #JammuKashmir