ఫరూక్ అబ్దుల్లా దేశద్రోహ వ్యాఖ్యలు

Sep 24, Thu 2020 11:45 PM Politics

అది నోరా…తాటిమట్ట…! తినేది భారత దేశ తిండి. పాడేది పాకిస్తాన్, చైనాల పాట. అందులోనూ ఆయన ఓ పార్టీ అధ్యక్షుడు.! ఇంకా చెప్పాలంటే.. సీఎంగా కూడా పని చేశాడు. అలాంటి వ్యక్తి…జమ్మూకశ్మీర్ ప్రజలకు మొత్తం తామే అసలైన ప్రతినిధిని అనే భ్రమలో ఉన్నాడు.! నిజమే భ్రమల్లో జీవించే వ్యక్తులు ..., రియాల్టీకి చాలా దూరంగా బ్రతుకుతారు.! తాము ఫేడప్ లీడర్లమయ్యామని తెలిసినా..., అసలు వాస్తవాన్ని మాత్రం ఇంకా గ్రహించరు. ఈ విషయాలన్నీ ఎందుకని అనుకుంటున్నారా? అదే...! నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, కేంద్రమాజీ మంత్రి ఫరూక్ అబ్దుల్లా గురించి...! పాకిస్తాన్ , చైనాపై తనకున్న భక్తిని చాటుతూ..., ఆయన మరోసారి తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నాడు.!

కాంగ్రెస్ కు.., అలాగే లెఫ్ట్ లిబరల్ వాదుల మౌత్ పీస్..., వెబ్ పేజీగా.., పేరుగాంచిన “ది వైర్” కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫరూక్ అబ్దుల్లా...., భారత ప్రభుత్వంపై తనకున్న అక్కసునంత బయటపెట్టుకున్నారు. భారత్ లో కశ్మీర్ ప్రజలు ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణింపబడుతున్నారని…, వీరంతా కూడా ఇండియా పాలన కంటే…, చైనా పాలనే బెస్ట్ అనుకునే అవకాశముందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆర్టికల్ 370, 35 A, రద్దును జమ్మూకశ్మీర్ లోని ప్రజలు ఎవరూ స్వాగతీంచలేదని చెప్పుకొచ్చారు.

గత ఏడాది ఆగస్టు 5వ తేదీన కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం… జమ్మూకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే, ఆర్టికల్ 370ని పూర్తిగా రద్దు చేసింది. ఈ క్రమంలో మాజీ సీఎంలైన మెహబూబా ముఫ్తి, ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా సహా పలువురు నేతలను గృహ నిర్బంధంలో ఉంచింది. అయితే ఆర్టికల్ 370 రద్దుకు ముందు కశ్మీర్ లోయలో భద్రతబలగాల మోహరింపుపై తాను హోంమంత్రి అమిత్ షాను , అలాగే ప్రధాని మోదీని సైతం ప్రశ్నించానని.., అయితే వారు మాత్రం, భద్రతా కారణాల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తనతో చెప్పారని ఫారూక్ ఆ ఇంటర్వ్యూలో తెలిపారు.కానీ జస్ట్ మూడు రోజుల్లోనే.., జమ్మూకశ్మీర్ స్వయం ప్రతిపత్తిని పూర్తిగా రద్దు చేస్తారని తాను అసలు ఊహించలేకపోయాయని ఫరూక్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే జమ్మూకశ్మీర్ స్టేట్ లో..., ఆర్టికల్ 370 రద్దు తర్వాత.., లద్దాక్ లో, జమ్మూలో ప్రజలు స్వీట్లు పంచుకున్న విషయాన్ని ఫరూక్ అబ్దుల్లా ది వైర్ ఇంటర్వ్యూలో మాత్రం మర్చిపోయారు.

లోక్ సభలో ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి జరిగిన చర్చలో స్వయంగా జమ్మూకశ్మీర్ కు చెందిన లద్దాక్ ఎంపీ జమ్యాంగ్ నాంగ్యాల్ పాల్గొన్నారు. కశ్మీర్ లోయలోని పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ తీరును ఎండగట్టారు. కశ్మీర్ ప్రజలకు..., ఫరూక్ అబ్దుల్లా, అలాగే ముఫ్తి కుటుంబాలు ఎలా అన్యాయం చేశాయో చెప్పుకొచ్చారు. ఆ రోజున యువ ఎంపీ నాంగ్యాల్ మాట్లాడిన దృశ్యాలు..., ఇప్పటికీ అందరి కళ్ళల్లో మెదులుతూనే ఉన్నాయి. ఇవన్నీ మర్చిపోయిన ఫరూక్ అబుల్లా ఇప్పుడూ ఏ ప్రజల గురించి మాట్లాడుతున్నారు.! ఫరూక్ అబ్దుల్లా దృష్టిలో జమ్మూకశ్మీర్ ప్రజలు అంటే కేవలం కశ్మీర్ లోయలో నివసించే వారేనా? మరి జమ్మూ, లద్దాక్ లలో నివసించే ప్రజల హక్కులు, వారి మనోభావాల సంగతి ఏంటి? జమ్మూ, లద్దాక్ ప్రజలు... ఆర్టికల్ 370,35ఏల రద్దును స్వాగతించారు. జమ్ము, లద్దాక్ ప్రజలు తమను ఎందుకు ఛీ కొడుతున్నారో.. ఫరూక్ అబ్దుల్లా లాంటి నేతలు ఆత్మవలోకనం చేసుకుంటే మంచిది.! కశ్మీర్ లోయనూ అంతా పీస్ పులే.! జస్ట్ నాలుగు జిల్లాలో మాత్రమే కాసింత వేర్పాటువాద సమస్య ఉంది. ఈ నాలుగు జిల్లాల సమస్యను మొత్తం జమ్ముకశ్మీర్ కు అటు లద్దాక్ కు అంటగట్టి…ఇన్నాళ్లు తాము ఆడింది ఆట…పాడింది పాటగా రాజ్యం చేసింది ఫరూక్ అబ్దుల్లా కుటుంబం.

కానీ ఇప్పుడు…, ఏ నయా భారత్ హై! ఇక్కడ వేర్పాటువాదులకు , జాతి విచ్ఛిన్నకర తుక్డే తుక్డే గ్యాంగులకు స్థానం లేదు.! అయినా ఇంకా ఈ ఏజ్ లో ఈ వేర్పాటువాద రాజకీయాలేంటి? చుప్ చాప్ ఘర్ మే బైఠ్ కే ఆరామ్ కరోనా ఫరూక్ అబ్దుల్లా..!

#FarooqAbdullah #Kashmir #HateWords