భారత రక్షణ దళాలకై HAL అధునాతన భారీ హెలీకాప్టర్

Sep 24, Thu 2020 11:41 PM In Focus

బలమే జీవనం… బలహీనతే మరణం. అందుకే మనం బలవంతులం కావాలి.. కేవలం సైనిక శక్తి ఉంటే సరిపోదు. అత్యాధునిక ఆయుధ సంపతి కూడా ఉండాలి. అలాంటి బలవంతులనే ఈ ప్రపంచం గౌరవిస్తుంది. దేశ రక్షణకు అవసరమైన ఆయుధ సంపత్తి కోసం విదేశాలపై ఇంకా ఎంతకాలం ఆధారపడాలి. రక్షణ రంగంలోనూ స్వావలంభన సాధించాలి. ఆ దిశగా మోదీ ప్రభుత్వం చేపట్టిన మేకిన్ ఇండియా ఫలితాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి.

తాజాగా భారత రక్షణ దళాల కోసం సరికొత్త హెలికాఫ్టర్ రెడీ అయ్యింది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ హెలికాఫ్టర్లు భారత సైన్యంలో చేరడానికి రంగం సిద్ధం చేసింది హిందూస్తాన్ ఏరోనాటికల్. ప్రస్తుతం తూర్పు లద్దాక్ లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. కీలకమైన పర్వతాల తిష్టవేసిన భారత సైన్యం.. గుంట నక్క చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనిక శిబిరాలను కనిపెట్టుకు కూర్చొన్నాయి. డ్రాగన్ సైనికులు తోకజాడిస్తూ భారత భూభాగంలోని చొరబడేతే ఇంక అంతే ! డ్రాగన్ సైనికుల భరతం పట్టేందుకు సర్వం సిద్ధంగా ఉన్నారు. ఈ వింటర్ సిజన్ లో సైతం బలగాల మొహరింపు ఉంటుందని భారత సైనిక వర్గాలు చెబుతున్నాయి. అందుకోసం అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు.

మైనస్ డిగ్రీస్ గడ్డకట్టే చలిలో… సైనిక అవసరాల కోసం హిందూస్తాన్ ఏరోనాటికల్ రెండు అత్యాధునిక హెలికాప్టర్లను రెడీ చేసింది. వీటిని మేకిన్ ఇండియా పథకంలో భాగంగా వీటిని రూపొందించింది HAL. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన లైట్ కంబాట్ హెలికాఫ్టర్ –LCH, అలాగే అడ్వాన్సుడ్ లైట్ యూటిలిటీ హెలికాఫ్టర్ –ALH లు ఈ శీతకాలంలో లద్దాక్ ప్రాంతంలో సైన్యానికి సేవలు అందించనున్నాయి. సియాచిన్ గ్లేసియర్ ప్రాంతలో సైనిక అవసరాల కోసం ALH హెలికాఫ్టర్లను భారత ఆర్మీ ఉపయోగించుకుంటోంది. ఇక అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన లైట్ యూటిలిటీ హెలికాఫ్టర్ మొదటిసారిగా గాల్లో చక్కర్లు కొట్టింది. దాదాపు 22 నిమిషాల పాటు గగనవిహారం చేసిన ఈ హెలికాఫ్టర్ బరువు 3 టన్నులు. సాయుధ దళాలతోపాటు, పౌరసేవలకు సైతం ఉపయోగపడేలా దీనిని రూపొందించినట్లు హెచ్ఏఎల్ అధికారులు తెలిపారు. అద్దాల కాక్ పీట్ ఉండటం ఈ పీటీ-2 హెలికాఫ్టర్ల ప్రత్యేకత. అంతేకాదు 400 కిలోల పేలుడు పదార్థాలను, అలాగే ఆయుధాలను ఈ హెలికాఫ్టర్లు ఫార్వడ్ లైన్ లోని సైనిక స్థావరాల వరకు మోసుకుని పోగలవు.

#Hal #IndianArmy #Helicoptor