నేపాల్ భూములను దోచేస్తున్న చైనా

Sep 23, Wed 2020 11:06 PM In Focus

-- డ్రాగన్ ఫార్ములాకి బలైపోతున్న ఓలీ

ఎవరికైనా సరే…, ఏదైనా భూమిపై అధికారం లభిస్తే ఏం చేస్తారు? మొదట తన అధికారపరిధిలో ఉన్న భూమి హద్దులు ఎక్కడి వరకు ఉన్నాయో చూస్తారు? అవసరమైన చోట గుర్తుగా హద్దు రాళ్లను నాటేస్తారు. ఇక ఆ భూమి పక్కన కన్నింగ్ ఫెలో ఉంటే…హద్దు రాళ్లే కాదు ఫెన్సింగ్ కూడా వేస్తారు. ఎందుకంటే అది మన భూమి. ! మరి ఇదే…., మన దేశ సరిహద్దుల విషయం వచ్చేసరికి మాత్రం…, మన పాలకులు ఉదాసీనంగా వ్యవహారించారు. అది డ్రాగన్…ఒక్కొ దేశాన్ని మింగేస్తూ మన సరిహద్దుల వరకు వస్తుందని…, టిబెట్ ను మనం కాపాడాలని ఆనాటి ఉప ప్రధాని సర్ధార్ వల్లభాయ్ పటేల్…. జవహార్ లాల్ నెహ్రూను హెచ్చరించారు కూడా. కానీ ఏం చేస్తాం…! మన దేశ ఉత్తర సరిహద్దుల్లో…, బౌద్ధ ధర్మ గురువులకు నెలవుగా…, శాంతియుత దేశమైనా టిబెట్ పై…, గుంట నక్క చైనా దురాక్రమణ చేసి…, ఆక్రమించుకున్నప్పుడు…ది గ్రేట్ శాంతిదూత నెహ్రూ కళ్ళప్పగించి చోద్యం చూశారు. ఇంకా అలీన విధానమన్నారు. హిందీ చీనీ భాయ్ భాయ్ అన్నారు. పంచశీల ఒప్పందమని గొప్పలకు పోయారు. చివరకు అదే జిత్తులమారి గుంటనక్క చైనా…, టిబెట్ తర్వాత మన దేశంపై దురాక్రమణకు దిగడమే కాదు లద్దాఖ్ లోని అక్సాయ్ చిన్, అరుణాచల్ ప్రదేశ్ లోని మరికొన్ని ప్రాంతాల్లోని భూములను ఆక్రమించుకుంది. తాజాగా తూర్పు లద్దాక్ లో మరోసారి చైనా దురాక్రమణకు దిగింది. చైనా దురాక్రమణను తిప్పికొట్టేందుకు మన దేశ సైనికులు, మోదీ ప్రభుత్వం దృఢ చిత్తంతో వ్యవహారిస్తోంది.

ఇక… ఇప్పుడు అచ్చం మన దేశంపై పన్నిన వ్యూహాన్నే…నేపాల్ పై కూడా పన్నింది గుంట నక్క చైనా. మీరు కమ్యూనిస్టులే.., మేము కమ్యూనిస్టులమేనంటూ నేపాల్ లోకి చొరబడిన చైనా కంపెనీలు, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ…, నేపాల్ ఉత్తర సరిహద్దుల్లోని భూభాగాలను క్రమంగా కబ్జా చేస్తోందని తెలుస్తోంది. కానీ… దేశ సరిహద్దులను కాపాడాల్సిన నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ మాత్రం… చైనా దౌత్యవేత్త… హు యాంకీ మాయమాటలకు ఊ కొడుతున్నారని ఆ దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నేపాల్ – చైనా సరిహద్దుల్లోని సహజ సిద్ధమైన నదుల గమనాన్ని మార్చడం ద్వారా నేపాల్ లోని 10 ప్రాంతాలకు చెందిన 33 హెక్టార్ల భూమిని చైనా ఆక్రమంగా ఆక్రమించుకుంది. బర్దియా, కపిలవస్తు, పాప్తిరి జిల్లాలో అయితే చైనా ఆక్రమణలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు కూడా జరిగాయి.

తాజాగా నేపాల్ లోని హుమ్ లా జిల్లాలోని బోర్డర్ లోకి చొరబడిన చైనా కంపెనీలు…, అక్కడ ఏకంగా 11 బహుళ అంతస్థుల భవనాలను నిర్మించాయి. 2005 వరకు కూడా హుమ్ లా బోర్డర్ ప్రాంతంలో కొన్ని గూడిసెలు మాత్రమే ఉండేవని నేపాలీ మీడియా చెబుతోంది. నమ్కా రూరల్ మున్సిపాలిటీ ఛైర్మన్ బిష్ణు బహదూర్ లామా ఈ ప్రాంతానికి వెళ్లినప్పుడు చైనా సిబ్బంది ఆయన్ను అడ్డుకున్నారు. భవనాలు నిర్మించిన ప్రాంతం చైనాదని…వెంటనే అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోవాలని చైనా అధికారులు అతన్ని బెదిరించారు. అంతేకాదు నేపాల్-టిబెటన్ సరిహద్దులుగా గుర్తిస్తూ పూర్వకాలంలో ఏర్పాటు చేసిన హద్దు రాళ్ళను సైతం చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తొలగించిదని బిష్ణు బహదూర్ తెలిపారు.

ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం నెపంతో చైనానే… ప్రాచీన కాలం నాటి ఫిల్లర్ నంబర్ 11 ను కూల్చేసిందని…, ఆ తర్వాత దాన్ని పునరుద్ధరించలేదని నేపాల్ అధికారులు వాపోతున్నారు. చైనా భూ ఆక్రమణలను నేపాల్ ప్రభుత్వం లైట్ గా తీసుకుంటుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నేపాల్, చైనా మిత్రదేశాలని.. , రెండు దేశాల మధ్య సరిహద్దుల విషయంలో అసలు వివాదాలే లేవని నేపాల్ హోంశాఖతోపాటు విదేశాంగశాఖ మంత్రులు ఆ దేశ ప్రజలను మభ్యపెడుతున్నారు. సో ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేపాల్ ప్రజలారా జాగృతం కండి. డ్రాగన్ చైనా తాబేదార్లను నేపాల్ నుంచి తరిమికొట్టండి.

#ChinaInfiltration #China #Nepal #Oli #XiJinping