ప్రపంచంలోనే ఎత్తైన టన్నెల్

Sep 17, Thu 2020 09:57 PM In Focus

-- లద్దాక్‎లో BRO వ్యూహాత్మక నిర్మాణం పూర్తి
-- జాతికి అంకితమివ్వనున్న మోదీ
-- సొరంగ మార్గం విశేషాలివే

దేశంలోనే అత్యంత పొడవైన సొరంగమార్గపు రహదారి ప్రారంభానికి రంగం సిద్ధమైంది. భారత్ కు రక్షణపరంగానూ అత్యంత వ్యూహాత్మకం కానున్న అటల్ టన్నెల్ గురించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. హిమాచల్ ప్రదేశ్ లోని మనాలీను లద్దాఖ్ లోగల లేహ్ ను ఈ సొరంగమార్గం అనుసంధానించనుంది. ఇది అతి త్వరలో వినయోగింలోకి రానుంది. తొలుత 6 సం లలో దీని నిర్మాణం పూర్తిచేయాలనకున్నా పదేళ్లు పట్టింది. దానికి గల కారణం నిధుల విడుదలలో జాప్యం, వాతావరణ అననుకూల పరిస్థితులని చెబుతారు. మోదీ ప్రభుత్వం వచ్చాక ఈ నిర్మాణానికి సంబంధించిన అవరోధాలు తొలగి పనులు ఊపందుకున్నాయి. ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైన ప్రదేశంలో నిర్మితమైన అతి పొడవైన టన్నెల్ గా పేరు గాంచింది.

సముద్ర మట్టానికి పది వేల అడుగుల ఎత్తులో ఈ టన్నెల్‌ నిర్మాణం జరిగింది. టన్నెల్ పొడవు 8.8 కిమీ. మనాలిలేహ్‌ హైవేపై రోహ్తంగ్‌ పాస్ కింద నిర్మించబడిన ఈ సొరంగ మార్గంతో మనాలి-లేహ్‌ మధ్య దూరం చాలా వరకు తగ్గనుంది. లేహ్ నుంచి మనాలీకి దూరం 475 కిమీ ఉండగా దీని ద్వారా 46 కిమీ మేర దూరం తగ్గనుంది తద్వారా నాలుగు గంటల సమయం ఆదా అవుతుందని అధికారులు వెల్లడించారు. ఈ సొరంగ మార్గానికి... మాజీ ప్రధాని భారత‌ రత్న అటల్ బిహారీ వాజ‌పేయి పేరును పెట్టాలిని మోదీ నిర్ణయించారు. అంతకుముందు దీనిని రోహ్తాంగ్ టన్నెల్ గా పిలవడం జరిగింది.

2010 జూన్ 28న‌ ఈ టన్నెల్‌కు శంకుస్థాపన జరిగింది. భారతదేశం యొక్క వ్యూహాత్మక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) చేత ఈ సొరంగం నిర్మించబడింది, పునాది రాయి మే 26, 2002 న పడినప్పటికీ.. ఈ ప్రతిష్టాత్మక సొరంగం నిర్మించాలనే నిర్ణయం అటల్ బిహారీ వాజ్‌పేయి భారత ప్రధానిగా ఉన్నప్పుడు జూన్ 3, 2000 వ సంవత్సరమున తీసుకోబడింది. సుమారు రూ. 3200 వేల కోట్ల రూపాయల దీనికై వెచ్చించడం జరిగింది. 10.5 మీటర్ల వెడల్పుతో గుర్రపుడెక్క ఆకారంలో ఈ సొరంగ మార్గముంటుంది. టన్నెట్ లో ఇరువైపులా 1 మీటరు వెడల్పు గల ఇందుకోసం అత్యాధునిక ఆస్ట్రేలియన్ టన్నెలింగ్ పద్ధతులను అనుస‌రించారు. టన్నెల్‌ లోపల 300 సీసీ కెమెరాలు అంటే ప్రతి 60 మీటర్లకు ఒక సీసీ కెమెరా, ప్రతి 500 మీటర్లకు ఓ అత్యవసర ద్వారాన్ని ఏర్పాటుచేశారు. అగ్నిప్రమాదాల నుండి బయటపడే రక్షణ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. సొరంగం లోపల వాహనాలు గంటకు గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో ప్ర‌యాణించేందుకు అవ‌కాశ‌ముంటుంది.

"నిర్మాణంలో ఉన్నప్పుడు వనరులను సమీకరిండం చాలా కష్టమైన పని. మేము చాలా సవాళ్లను ఎదుర్కొన్నాము, కాని కలిసికట్టుగా శ్రమించి నిర్మాణాన్ని పూర్తి చేయగలిగాము" అని చీఫ్ ఇంజనీర్ కెపి పురుషోథమన్ అన్నారు.లదాఖ్‌లో మోహరించిన భారత సైనికుల‌కు ఈ టన్నెల్‌ ఎంతో ఉపయోగపడుతుందటున్నారు అధికారులు. శీతాకాలంలో ఆయుధాలు, లాజిస్టిక్స్ సరఫరా సులభమవుతుందని అంటున్నారు. ఈ నెల చివర్లో ప్రధాని మోదీ అటల్ టన్నెల్‌ ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

#Ladakh #Tunnel #Bro #Modi