ఆంధ్రప్రదేశ్ లో ఆగని దాడులు

Sep 16, Wed 2020 08:47 PM Politics

-- హిందూ ఆలయాలే టార్గెట్
-- తాజాగా విజయవాడ దుర్గ గుడి ఆలయంలో వెండి సింహాలు మాయం
-- హిందువుల ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ లో టార్గెట్ హిందూ దేవాలయాలు అన్నట్లుగా వరుస ఘటనలు తీవ్ర ఆందోళనలు కలిగిస్తున్నాయి. హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. అంతర్వేధిలో రథం ఘటన మరిచిపోకముందే తాజాగా విజయవాడ కనక దుర్గమ్మ ఆలయంలో మూడు వెండి సింహాలు కనిపించకుండా పోయాయి. అమ్మవారి వెండి రధానికి ఉండవలసిన నాలుగు వెండి సింహాలలో ఒకటి మాత్రమే మిగిలి ఉండటం, ఇక ఆ విషయాన్ని ఇన్ని రోజుల పాటు బయటకు రాకుండా జాగ్రత్త పడటం ప్రస్తుతం పలు అనుమానాలకు తావిస్తోంది. హిందూ దేవాలయాలపై దాడులు పెరుగుతున్నాయి అనడానికి మరో ఉదాహరణగా ఈ ఘటన నిలుస్తోంది. దీనిపై యావత్ హిందూ సమాజం తన ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో వరుసగా జరుగుతున్న దాడులపై హిందూ సంఘాలు మండిపడుతున్న తరుణంలో ఈ వార్త వెలుగులోకి రావటం మరింత శోచనీయం. అయితే తాజా ఘటనపై దుర్గమ్మ ఆలయ ఈవో సురేష్ బాబు తీరు పట్ల అనుమానాలను వ్యక్తం అవుతున్నాయి. ఘటన జరిగిన అనంతరం ప్రశ్నించిన మీడియాకు అలాంటిదేం జరుగలేదు అని బుకాయించిన ఆలయ ఈవోను విచారిస్తేనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయన్నది ప్రధమంగా వినిపిస్తున్న డిమాండ్. పలు ఉద్రిక్తతల అనంతరం రికార్డుల పరిశీలన కోసం మూడు రోజుల సమయం కావాలని ఈవో తెలపడం జరిగింది. అయితే ప్రతిపక్ష పార్టీలు దీనిపై విమర్శలు గుప్పిస్తున్నాయి. రికార్డుల పరిశీలన కు మూడు రోజుల సమయం దేనికంటూ ప్రశ్నిస్తున్నాయి. హిందువులను మళ్లీ ఏమార్చేందుకు 3 రోజుల గడువు కావాలని అంటున్నారా... ఈ మూడు రోజుల్లో హుటాహుటిన నకిలీ సింహాలను తయారు చేసి వాస్తవాలను కప్పిపుచ్చుదామనుకుంటున్నారా... లేక ఇవేవి కాకుండా మూడు సింహాలు అడవికి వేటకు వెళ్లాయి.. వాటిని త్వరలోనే పట్టుకు వస్తాం అంటూ మతిస్థిమితం లేనివాడు, తేనె పట్టు కోసం వంటి కథల సరసన చేర్చి తప్పించుకోవాలనుకుంటున్నారా అంటూ హిందువులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు, వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

ఇక భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి భక్తులకు , మీడియా ముందు రథాన్ని చూపించాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక దుర్గగుడిలో వెండి రధాన్ని బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు పలువురు సందర్శించారు. జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలను అందించారు. ప్రభుత్వ అసమర్ధత ఇలాంటి ఘటనలకు కారణమని దుయ్యబడుతున్నారు. అయితే టిడిపి హయాంలో కూడా ఇటువంటి హిందూ వ్యతిరేక ఘటనలు చాలా జరిగాయన్న విషయం మనం మరచిపోరాదు.

మరోవైపు సెక్యూరిటీ ఏజెన్సీకి దేవాలయ భద్రతను అప్పగించామని, సెక్యూరిటీ ఏజెన్సీ భద్రతా లోపం తేలితే దానిపై చర్యలు తీసుకుంటామని వెలంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయనేది అతని వెర్షన్. అంతర్వేది ఘటన తరువాత అన్ని దేవాలయాల్లోని భద్రతా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. తొలుత అయితే అలాంటిదేమీ జరగలేదని చెప్పుకొచ్చారు దుర్గ ఆలయ ఈవో సురేష్ బాబు. అక్కడికి కొద్దిసేపటికే ఈ ఘటనపై విచారణకు కమిటీ వేస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొనడం గమనార్హం. గత ప్రభుత్వ హయాంలో ఈ ఘటన జరిగి వుండవచ్చు అనే అనుమానాలను కూడా వ్యక్తం చేశారు వెల్లంపల్లి శ్రీనివాస్.. ఎవరి హయాంలో జరిగిన బాధ్యత వహించవలసింది ప్రస్తుత ప్రభుత్వమే... మా హిందువులకు రాజకీయాలు అనవసరం.. మాకు అన్యాయం జరుగుతోంది.. మాపై దాడులు జరుగుతున్నాయి.. వాటిని ఆపండి లేదంటే మా ఆగ్రహాన్ని మీరు తట్టుకోలేరు అనేది సదరు హిందువు మనోగతంగా మనమిక్కడ అర్ధం చేసుకోవచ్చు..

ఇప్పుడు దుర్గమ్మ ఆలయం ఘటనకు సంబంధించిన వార్తలు వచ్చిన మరి కొన్ని గంటలలోనే నిడమానూరులో సాయిబాబా ఆలయంలో సాయిబాబా విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయం ఇప్పుడు మరింత హిందువుల ఆగ్రహానికి కారణమవుతోంది. గుర్తుతెలియని ఆగంతకులు. విజయవాడ రూరల్ మండలం నిడమానూరు లో సాయిబాబా విగ్రహాన్ని నిన్న అర్ధ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. షిరిడి సాయి బాబా మందిరం బయట నెలకొల్పిన బాబా విగ్రహంలో తల భాగాన్ని విరగ్గొట్టారు. మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా, స్థానికులు ఆలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ అక్కడి పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ఆలయం చుట్టూ ఉన్న సీసీ కెమెరాల రికార్డులను పరిశీలిస్తున్నారు.

ఇలా హిందువులపై విద్వేష శక్తులు దాడులు చేయడం వాటిని పాలకులు పట్టించుకోకుండా రాజకీయాలు చేయడం వంటివి ఇంకెన్నాళ్లు.. ఆలయాలను సరైన భద్రత కల్పించలేని ప్రభుత్వాలకు ఆ ఆలయ నిధులు మాత్రం తమ బొక్కసం లోకి నింపుకోవడానికి కావాలా.. అన్నది ప్రస్తుతం వినిపిస్తున్న సూటి ప్రశ్న.

#AndhrPradesh #Kanakadurga #Ornments #Vijayawada #Christianity