మొఘలులు మన హీరోలా..?! ఆ మ్యూజియం పేరును మార్చేయండి..!

Sep 15, Tue 2020 08:45 PM In Focus

-- అధికారులకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హుకుం

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ మాటల్లో, చేతల్లో మనకు ఒకే భావం కనిపిస్తుంది. అదే జాతీయతా భావం. తాజాగా యోగి చేసిన వ్యాఖ్య దానిని మరోసారి పునరుద్ఘాటించింది. మన దేశానికి మొఘలులు హీరోలా..? అలా ఎలా..? ఛత్రపతి శివాజీ మన నాయకుడు.. హౌ కెన్ మొఘల్స్ బి అవర్ హీరోస్ అని తేల్చిచెప్పారు.

2016 జనవరిలో అఖిలేశ్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ గవర్నమెంట్ మొఘల్ మ్యూజియం ప్రాజెక్టుకు అంగీకరించింది. తాజ్ మహల్ కు 2 కిమీ దూరంలోనే 6 ఎకరాల స్థలంలో, 141 కోట్ల రూపాయల ఖర్చుతో మొఘలుల సంస్కృతి, వారి చిత్రాలు, వస్తువులు, ఆభరణాలు, దుస్తులు, ఆయుధాలు వంటివాటిని పొందుపరుస్తూ ఈ మ్యూజియం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు నిర్మాణం తుది దశకు చేరుకుంది. మన దేశంలోకి దేహి అని అడుగుపెట్టి ఆ తరువాత అన్నంపెట్టిన మనపై వారి క్రూరాతి క్రూర మతోన్మాద చర్యలతో వారి బానిసలుగా మార్చుకుని 1526-1540, 1555-1857 లప్రాంతంలో ఏలుబడి సాగించారు.

అటువంటి దోపిడీదారులు, భారతీయులను ఊచకోత కోసిన పాశండులలకు సంబంధించి మ్యూజియం ఏర్పాటు చేయడం ఒక ఎత్తైతే దానికి మళ్లీ మొఘల్ మ్యూజియం అని పేరు పెట్టడం గ్రహచర్యంగా భావించిన యోగి ఆదిత్య నాధ్.. మన హీరో ఛత్రపతి మహారాజ్ మాత్రమే.. అందుకే దానికి మనవారి పేరు పెట్టాలి.. అంతేకాని బానిస గుర్తులు, వారి పేర్లు మనకు వన్నెతీసుకురావు అని నిర్మొహమాటంగా తేల్చిచెప్పారు. అంతకు పూర్వం కూడా అలహాబాద్ ను ప్రయాగ రాజ్ గా, మొఘల్సరాయ్ రైల్వే స్టేషన్ ను దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్ గా పేరు మార్చారు యోగి. తన ప్రభుత్వం ఎప్పుడూ జాతీయవాద భావజాలాన్ని పెంచి పోషిస్తోందని, దానికి విరుద్ధంగా వున్నది ఏదైనా తొలగించబడుతుందని ఆయన స్పష్టం చేశారు. జాతి ఐక్యతకు, ఆత్మాభిమానానికి చిహ్మం ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేది మరచిపోరాదని ఆగ్రా డివిజన్ కు సంబంధించిన ఒక సమీక్షా సమావేశంలో తెలిపారు. ఇదే విషయాన్ని ఉటంకిస్తూ జయ్ హింద్, జయ్ భారత్ అంటూ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు యోగి ఆదిత్యనాధ్. దీనిని జైశివాజీ, చత్రపతి మహారాజ్ కి జై అంటూ రీట్వీట్ చేసారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్..

#YogiAdityanath #MoghulMuseum #UttarPradesh