పాకిస్తాన్‎లో #ShiaGenocide హ్యాష్‌ట్యాగ్‌ అసలు కథ..!

Sep 15, Tue 2020 08:44 PM In Focus

-- కొనసాగుతున్న షియాల అణిచివేత
-- షియా ముస్లింలపై సున్నీ వర్గం దాడులు
-- పాకిస్తాన్‎లో షియా-సున్నీల మధ్య ఘర్షణలు

పాకిస్తాన్.., ఒక ముస్లిం కంట్రీ..! ఇక.. పాక్ పాలకులు అయితే.. తమది ది గ్రేట్ ఇస్లామిక్ రిపబ్లిక్ అని గొప్పలు చెప్పుకుంటారు..! అయితే ముస్లింలందరూ ఒక్కటే అయినప్పుడూ.., ది గ్రేట్ ఇస్లామిక్ కంట్రీగా చెప్పుకునే పాకిస్తాన్ లో…, తోటి ముస్లింల మధ్య మతపరమైన వివక్ష ఎందుకు ఉంది? సున్నీ-షియాలు అంటూ రెండు వర్గాల మధ్య ఘర్షణలు ఎందుకు జరుగుతున్నాయి? సున్నీ మెజారిటీ స్టేట్ లో షియా వర్గానికి చెందిన ముస్లింలను బ్రతకనివ్వరా? పాకిస్తాన్ లో గత 70 ఏళ్ళుగా.., షియా తెగ ముస్లింలు.., తీవ్ర అణిచివేతకు గురవుతున్నారా? అసలు పాకిస్తాన్ లో ఏం జరుగుతోంది?

నిజానికి అఖండ భారత్ ను ముక్కలు చేయడంలో…, సున్నీలతోపాటు షియా వర్గం ముస్లింలు కూడా దేశ విభజనలో పాలుపంచుకున్నారు. రెండు వర్గాలు ఏకమై ముస్లింలీగ్ నాయకత్వంలో డైరెక్ట్ యాక్షన్ పేరుతో నరమేధానికి పాల్పడ్డారు. హిందూ-సిక్కల రక్తాన్ని ఏరులై పారించి…, చివరకు తామనుకున్న పాకిస్తాన్ ను సాధించుకున్నారు. పాకిస్తాన్ అనే ఇస్లామిక్ దేశ ఆవిర్భావం కోసం…, షియా-సున్నీ వర్గాలది సమానమైన పాత్ర అని భారత దేశ ప్రజలు మర్చిపోరాదు.! అయితే…, పాకిస్తాన్ ఏర్పడిన తర్వాతే..., వాట్ ఈజ్ ఇండియా, వాట్ ఈజ్ పాకిస్తాన్ అనే విషయం షియా వర్గం ముస్లింలకు బాగా అర్థమైంది. పాకిస్తాన్ సున్నీ ముస్లిం జనాభా అధికంగా ఉన్న దేశం. ఆ దేశంలో షియా ముస్లింలు 20 శాతం వరకు ఉంటారు. పాకిస్తాన్ లెక్కల ప్రకారం ఆ దేశంలో హిందువులు మైనారిటీలు. వారి తర్వాత షియా ముస్లింలే మైనారిటీలు. సున్నీ ముస్లింల ఏలుబడిలో పాకిస్తాన్ షియాలకు అన్ని కష్టాలే.! రాజ్యాధికారంలో వాటా సంగతి పక్కన పెడితే.., కనీసం తమను మనుషులుగా పరిగణించడం లేదని కొంతమంది షియా ముస్లింలు సోషల్ మీడియా వేదికగా తమ బాధలను వెల్లగక్కుతున్నారు.

తాను ఆరేళ్ల వయస్సున్నప్పుడు… పాకిస్తాన్ నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ఫ్రావిన్స్ అయిన కైబర్ ఫక్తూన్ క్వాలోని ఒక ప్రాంతంలో.., సున్నీ వర్గానికి చెందిన ముస్లింలు… 12 మంది షియాల ఇళ్ళను తగులబెట్టారని సహార ఖజ్మీ అనే షియా వర్గానికి చెందిన ఒకరు ట్వీటర్ ద్వారా తన బాధను పంచుకున్నారు. అలాగే తాను జర్మనీలో ఉన్నప్పుడు సున్నీ వర్గం చేతుల్లో తీవ్ర వివక్షకు గురయ్యానని సైమ్ రిజ్వి అనే యువకుడు ట్వీటర్ ద్వారా తెలిపాడు. తనతో కలిసి భోజనం కూడా చేసేందుకు ఇష్టపడలేదని వాపోయాడు. ఇక సారా బి హైదరి అనే జర్నలిస్ట్ అయితే.., పాఠశాలలో ఉన్నప్పుడు తనతోపాటు మరో షియా విద్యార్థిని…, సున్నీ విద్యార్థులు అవమానించారని, తమని మురికి ప్రజలన్నారని, ఈ విషయాన్ని టీచర్ కు చెబితే..., ముస్లిమేతరులైన మీతో ఇలాగే వ్యవహారిస్తారని చెప్పారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ లో షియాలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో # షియా జెనోసైడ్ అనే ట్విటర్‌ హ్యాష్‌ట్యాగ్‌ ఈ వారంలో అక్కడ ట్రెండింగ్ లోకి వచ్చింది.

సెప్టెంబర్ మొదటి వారంలో ప్రపంచ వ్యాప్తంగా మొహర్రం సంతాప దినాలను షియాలు జరుపుకున్నారు. పాకిస్తాన్ లో జనాభా పరంగా మైనారిటీలైన షియాలు అషురా ఊరేగింపును నిర్వహించారు. షియా వర్గానికి చెందిన మత పెద్దలు ఆ ఊరేగింపులో ప్రసంగించారు. అయితే ఈ ప్రసంగంలో కొంతమంది మత పెద్దలు సున్నీ వర్గాన్ని తక్కువ చేసి మాట్లాడారని సోషల్ మీడియాలో వేదికగా ఒక్కసారిగా విమర్శలు మొదలయ్యాయి. పాకిస్తాన్ మీడియా కూడా సున్నీ వర్గాన్ని వెనుకేసుకుని వస్తూ...షియా వర్గందే తప్పు అన్నట్లుగా ఆరోపణలు చేస్తూ కథనాలను ప్రసారం చేశాయి. ముఖ్యంగా పాకిస్తాన్ కు చెందిన సామాజిక కార్యకర్త ఆఫ్రీన్ చేసిన ట్వీట్ తర్వాతే షియాలపై దాడులు పెరిగాయని తెలుస్తోంది.

గడిచిన ఐదేళ్లలో పాకిస్తాన్ లో షియా వర్గంపై దాడులు విపరీతంగా పెరిగినట్లు అక్కడి నివేదికలు చెబుతున్నాయి. వందల సంఖ్యలో షియా ముస్లింలు హత్యలకు గురయ్యారు. అవుతూనే ఉన్నారు. సెప్టెంబర్ 6వ తేదీన కైబర్ ఫక్తూన్ క్వా రాష్ట్రంలోని కొహాట్ అనే పట్టణంలో షియా వర్గానికి చెందిన కైజర్ అబ్బాస్ అనే వ్యాపారిని అతని షాపులో కొంతమంది దుండగులు కాల్చి చంపేశారు. ఈ హత్య వెనుక సున్నీలకు అండగా నిలిచే దియోబంది అనే ఉగ్రవాద సంస్థ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత మరుసటి రోజు నుంచే పాకిస్తాన్ వ్యాప్తంగా షియాలే టార్గెట్ నిరసన ప్రదర్శనలు ప్రారంభం అయ్యాయి. సిపా-ఏ సహబా, తెహ్రిక్ లాబ్బా - ఎ- పాకిస్తాన్ అనే అతివాద సంస్థలు ఈ అల్లర్లకు నాయకత్వం వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాఫీర్…కాఫీర్…! షియా ఆర్ కాఫీర్ ! అంటూ షియా వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ నెల సెప్టెంబర్ 11న కరాచీలో నిర్వహించిన ర్యాలీ తర్వాత పాకిస్తాన్ లో రెండు వర్గాల మధ్య ఉద్రికత్తలు మరింత పెరిగాయి. అనేక హింసాత్మక సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి.

ఎప్పుడు భారత్ పై అసత్య ఆరోపణలు చేసే పాకిస్తాన్ పాలకులు…, తమ దేశంలో జరుగుతున్న షియా వర్గం ముస్లింల అణిచివేతలపై ఏమాంటారు? భారత్ లో ముస్లింలపై దాడులు జరుగుతున్నాయంటూ కట్టుకథలు అల్లే ఇండియలోని లుటియెన్స్ మీడియా జర్నలిస్టులు..ఇప్పుడు పాకిస్తాన్ లో షియాలపై జరుగుతున్న దాడులపై నోరేందుకు మొదపడం లేదు? షియా, సున్నీ అనే తేడా లేకుండా… వరల్డ్ లో ముస్లింలకు సేఫ్ ప్లెస్ ఏదైనా ఉందంటే అది భారత దేశమని మర్చిపోరాదు. కానీ కొంతమంది మతోన్మాదులు…, భారత్ ను సైతం తుక్డే తుక్డే చేయాలంటూ వర్శిటీల్లో కొన్ని తుక్డే గ్యాంగులను పెచ్చిపోషించి రెచ్చగొడుతున్నారు. వీరి పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. షియాల తర్వాత మొహర్రం ఊరేగింపులో పాల్గొనేది హిందువులనే విషయాన్ని షియాలు గుర్తుపెట్టుకోవాలి.

#ShiaGenocide #Pakistan #Shia #Sunni #AntiShia