‘పీవోకే’ పాక్‎లో భాగమట..! ‘హరామ్‎ఖోర్’ అర్థం సోమరితనమట..!!

Sep 15, Tue 2020 05:29 AM In Focus

-- మోడల్, కాంగ్రెస్ లీడర్ అర్షిఖాన్ పాక్ అనుకూల వైఖరి
-- గతంలోనూ పలు వివాదస్పద వ్యాఖ్యలు చేసిన బిగ్‎బాస్ ఫేం
-- లైవ్ డిబేట్‎లో కడిగిపారేసిన సంబిత్ పాత్ర

భారత గడ్డమీద నివసిస్తూ.. ఇక్కడి తిండి తింటూ.. ఇక్కడి నీళ్లు తాగుతూ.. కొందరు పాకిస్తాన్ పాట పాడుతుంటారు. అలాంటి కోవకే చెందినది మోడల్ అర్షిఖాన్. ఓ ప్రముఖ జాతీయ హిందీ న్యూస్ ఛానెల్ డిబేట్‎లో పాల్గొన్న అర్షిఖాన్.. పీవోకే విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. పీవోకే పాకిస్తాన్‎లో వుందంటూ పాక్ అనుకూల వైఖరిని ప్రదర్శించింది. ఇదే డిబేట్‎లో పాల్గొన్న బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర.. అర్షిఖాన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అసలు పీవోకే అంటే అర్థం చెప్పాలని డిమాండ్ చేశారు. అయినా, సమాధానం చెప్పకుండా వితండవాదానికి దిగింది అర్షిఖాన్.


ఇక, కంగనా రనౌత్‎ను టార్గెట్ చేస్తూ శివసేన లీడర్ సంజయ్ రౌత్ ఇటీవల ‘హరాంఖోర్ లడ్కీ’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో సంజయ్ రౌత్ వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తారా..? అసలు ‘హరాంఖోర్’ అంటే అర్థం తెలుసా అని..ప్రశ్నించారు సంబిత్ పాత్ర. అయితే, సమాధానాన్ని దాటవేసే ప్రయత్నం చేసిన అర్షిఖాన్.. ‘హరాంఖోర్’ అంటే వింత అర్థాన్ని చెప్పింది. ‘హరాంఖోర్’ అంటే తిట్టు కాదని.. ‘హరాం’, ‘హలాల్’ అనేవి ఉర్దూ పదాలని సెలవిచ్చింది. అంతేకాదు, ‘హలాల్’ అంటే హార్డ్ వర్క్ అని.. ‘హరాం’ అంటే సోమరితనం అని బదులు చెప్పింది. ఇస్లామిక్ చట్ట ప్రకారం ‘హలాల్’ అనేది అనుమతించబడిన పదమని అన్న అర్షిఖాన్.. అలాగే ఏదైనా నిషేధించబడిన చర్యను ‘హరాం’ అంటారని కొత్త అర్థాలు చెప్పింది. అంటే అల్లా అనుమతించని పనులు చేసేవాడిని ‘హరాంఖోర్’ అంటారని తెలిపింది అర్షిఖాన్.

ఎవరీ అర్షిఖాన్..?
రియాల్టీ షో బిగ్‎బాస్ కంటెస్టెంట్ అయిన అర్షిఖాన్.. 2019 లోక్‎సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరింది. అంతకముందు, పాకిస్తాన్ జెండాను తన ఒంటిపై ముద్రించుకుని న్యూడ్‎గా దర్శనమిచ్చింది. అఫ్ఘనిస్తాన్‎లో జన్మించిన అర్షిఖాన్.. నాలుగేళ్ల వయసు వున్నప్పుడు తన కుటుంబంతో కలిసి భారత్‎కు వచ్చింది. అంతకుముందు కూడా సోషల్ మీడియా వేదికగా చాలాసార్లు పాకిస్తాన్ పట్ల తనకున్న ప్రేమను చాటుకుంది అర్షిఖాన్. అంతేకాదు, పాకిస్తాన్ పౌరసత్వం పొందాలనే కోరికను కూడా చాలాసార్లు ప్రకటించింది.

మరోవైపు, పాకిస్తాన్ రియాల్టీ షో.. ‘అర్షి కా స్వయంవర్’లో పాల్గొనాలని కూడా నిర్ణయించుకున్నట్టు వార్తలొచ్చాయి. ఇందుకోసం ఆమె రెండు కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. విచిత్రమేమిటంటే.. తన పేరుతో షోను ఆఫర్ చేసిన పాకిస్తాన్ ఛానెల్ పేరు మాత్రం ఎక్కడ చెప్పలేదు

పాక్ క్రికెటర్ అఫ్రిదీతో సహవాసం..!?
అర్షిఖాన్ గతంలోనూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు, చేష్టలతో వార్తల్లో నిలిచింది. 2016లో భారత్ తో మ్యాచ్ ఓడిపోయి బాధలో వున్న పాక్ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఆఫ్రిదీనే తండ్రి అంటూ మీడియా ముందు సెన్షేనల్ కామెంట్స్ చేసింది అర్షిఖాన్. అంతేకాదు, అఫ్రిదితో ఏకాంతంగా గడిపిన ఫోటోలు, వీడియోలను కూడా రిలీజ్ చేసింది. అంతటితో ఆగకుండా అఫ్రిదితో పడకగది సంగతులను బయటపెట్టింది. బెడ్ రూమ్‌లో అఫ్రిదికి మించిన ప్రేమికుడు మరొకరుండరని చెప్పుకొచ్చింది. అతను చాలా మంచి వ్యక్తి అంటూ ప్రశంసించింది. అఫ్రిది వేరీ కేరింగ్, సెన్సిటివ్, రొమాంటిక్ అంటూ కొనియాడింది. అఫ్రిదీకి ప్రేమికుడిగా, స్నేహితుడిగా వందకి వంద మార్కులు వేస్తానని చెప్పుకొచ్చింది. కానీ అర్షిఖాన్ కామెంట్లపై అఫ్రిది ఏనాడూ నోరు విప్పలేదు. ఇదిలావుంటే, అప్పట్లో ఆర్షిఖాన్ పై పాకిస్థాన్‌లో రెండు ఫత్వాలు కూడా జారీ అయ్యాయి.

అంతకుముందు, అఫ్రిదీతో తాను శృంగారంలో పాల్గొన్నానని ప్రకటించి అందర్నీ అవాక్కయ్యేలా చేసింది అర్షిఖాన్. ఇదిలావుంటే, అర్షిఖాన్, షాహిద్ అఫ్రిదీలు దుబాయ్‌లో కనిపించారని యూఏఈకి చెందిన పత్రిక ప్రచురించింది. దుబాయిలో వీరిద్దరూ అత్యంత రహస్యంగా కలుసుకున్నారని తెలిపింది. వీరి కలయికపై యూఏఈ పత్రికలు పలు కథనాలు కూడా రాశాయి. అయితే ఈ కథనాల్ని అఫ్రీదీ కొట్టిపారేశాడు. క్రికెట్ మ్యాచ్ సందర్భంగా తనను ఎంతోమంది అభిమానులు కలుస్తుంటారని.. వారిలో అర్షిఖాన్ కూడా ఉండొచ్చని అప్పట్లో అర్షిఖాన్ తెలిపాడు. అయితే, ఆమెతో ఏకాంతంగా కలిసనట్టు వచ్చిన వార్తలు మాత్రం అవాస్తవమని అన్నాడు.

#ArshaKhan #PakStand #Pok #SambitPatra #ShahidAfridi