కుట్రదారుడు ఉమర్ ఖలీద్ కు బిగుస్తున్న ఉచ్చు..!

Sep 14, Mon 2020 08:55 PM In Focus

దేశంలో సీఏఏ వ్యతిరేకంగా జరిగిన అల్లర్ల వెనుక పెద్ద కుట్రే ఉన్నట్లు తెలుస్తోంది. కొంతమంది స్వయం ప్రకటిత మేధావుల నుంచి మొదలు పెడితే..., లెఫ్ట్ లిబరల్, దేశ విచ్ఛిన్నకరవాదులు, అలాగే కమ్యూనిస్టు పార్టీల నేతలకు సైతం ఈ అల్లర్లలో ప్రమేయం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ అల్లర్లలో దాదాపు 53 మంది పౌరులు మృతి చెందారు.

ముఖ్యంగా కొంతమంది నాయకులు, సామాజిక కార్యకర్తలు, స్టూడెంట్ లీడర్లు కావాలానే రెచ్చగొట్టే ప్రసంగాలతో...అల్లర్లు జరిగేలా ప్రేరేపించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరిలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ JNU విద్యార్థి సంఘం మాజీ నాయకుడు యునైటెడ్ ఎగైనెస్ట్ హేట్ కార్యకర్త ఉమర్ ఖలీద్ ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఉమర్ ఖలీద్ ను విచారించే సందర్భంలో ఈ అల్లర్లకు సంబంధించి మరిన్ని కుట్రకోణాలు భయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అల్లర్లకు సంబంధించి ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్ షీట్ లో మరికొంతమంది ప్రముఖల పేర్లు ఉన్నట్లు ఆన్ లైన్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వారిలో ప్రధానంగా సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితోపాటు, ప్రఖ్యాత ఆర్థికవేత్తగా పేరుగాంచిన జయంతి ఘోష్, ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ అపూర్వానంద్, అలాగే స్వరాజ్ అభియాన్ నాయకుడు, ప్రముఖ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్, ఇంకా భీమ్ ఆర్మీచీఫ్ చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే మతీన్ అహ్మద్, అలాగే ప్రస్తుత ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమన్నతుల్లా ఖాన్ వంటి నాయకుల పేర్లు చార్జ్ షీట్ లో ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.

ముఖ్యంగా JNU విద్యార్థులు దేవంగన కాలిత, అలాగే నటాషా నార్వాల్, జామియా మిలియా ఇస్లామియాకు చెందిన గుల్ ఫిషా ఫాతిమా ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా సేకరించిన కొన్ని ప్రాథమిక సాక్ష్యాలతోనే వీరందరి పేర్లు చార్జ్ షీట్ లో చేరిచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఢిల్లీ అల్లర్ల కేసులో తమ పార్టీ నేత యేచూరి పేరు ఉందనే ప్రచారం పై వామపక్ష పార్టీల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు వారు ఢిల్లీ పోలీసులను సంప్రదిస్తే చార్జీషిట్ లో ఏచూరి పేరు లేదని వారికి పోలీసులు క్లారిటీ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.మిగిలినవారికి నోటీసులు జారీ చేసి వారిని ప్రశ్నించిన తర్వాత అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

#UmarKhalid #DelhiUniversity #Jnu #AntiCaa