చైనా భారీ గూఢచర్యం

Sep 14, Mon 2020 08:38 PM In Focus

-- 10000 మంది భారతీయ ప్రముఖుల పై నిఘా
-- సమాచారాన్ని సేకరిస్తున్న చైనాకు చెందిన టెక్నాలజీ కంపెనీ

ప్రపంచానికి పట్టిన చెదపురుగు చైనా దేశానికి సంబంధించిన మరో వార్త ఇటీవల వెలుగులోకి వచ్చింది. భారత దేశంలోని సుమారు 10000 మందికి పైగా వున్న ప్రముఖులు, సంస్థలపై ఆ దేశం చేసిన, చేస్తున్న గూఢ చర్యానికి సంబంధించి వార్తలు అధికారింగానే చైనాదేశపు టెక్నాలజీ కంపెనీ తెలిపింది. చైనా... షెంజెన్‌లోని ఓ టెక్నాలజీ కంపెనీ... ఈ గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు తెలుపుతూ... ఆ సంస్థ తనను తాను హైబ్రీడ్ వార్‌ఫేర్‌గా చెప్పుకుంటోంది. “information pollution, perception management and propaganda పేటిట చేస్తున్న దొంగపనికి ట్యాగ్ ను కూడా యాడ్ చేసుకుంది. చైనా అభివృద్ధికి తాము ఎంతో కృషి చేస్తున్నట్లు ప్రచారం కూడా చేసుకుంటోంది. ఆ టెక్నాలజీ కంపెనీకి... చైనా ప్రభుత్వం, చైనా కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విదేశీయులపై ఈ కంపెనీ నిఘా పెట్టిందనీ... అందులో భాగంగా ఇండియాలో 10వేల మందికి పైగా వ్యక్తులు, సంస్థలపై గూఢచర్యం చేస్తోందని తమ దర్యాప్తులో తేలినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక తెలిపింది. ఆ కంపెనీ పేరు ఝెంజువా డేటా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ లిమిటెడ్. ఇది రియల్ టైమ్‌లో మానిటరింగ్ చేస్తోందని కూడా వివరించింది.

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, అమె కుటుంబ సభ్యులు, ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అశోక్ గెహ్లాట్, అమరీందర్ సింగ్, ఉద్ధవ్ థాక్రే, నవీన్ పట్నాయక్, శివరాజ్ సింగ్ చౌహాన్, క్యాబినెట్ మంత్రులు రాజ్ నాథ్ సింగ్, రవిశంకర్ ప్రసాద్, నిర్మల సీతారామన్, స్మృతి ఇరానీ, పియూష్ గోయల్, రక్షణ దళ చీఫ్ బిపిన్ సింగ్ రావత్ తో పాటూ... 15 మంది మాజీ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌లు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ బాబ్డే, కాగ్ ముర్ము, స్టార్టప్ కంపెనీ నిపుణ్ మెహ్రా, ఆత్‌బ్రిడ్జ్ కంపెనీకి చెందిన అజయ్ ట్రెహాన్, ప్రముఖ పారిశ్రామిక వేత్తలైన రతన్ టాటా, గౌతమ్ అదానీ ఇలా... పది వేల మందికి పైగా ఈ నిఘా లిస్టులో ఉన్నట్లు సమాచారం.

అలాగే మాజీ సీఎంలు రమణ్ సింగ్, అశోక్ చవాన్, సిద్ధరామయ్యతోపాటూ... 250 మంది అధికారులు, దౌత్యవేత్తలు, వివిధ రాష్ట్రాల పోలీస్ బాసులు, సీఎస్‌లపైనా నిఘా పెట్టినట్లు తెలిసింది. ది హిందూ గ్రూప్ ఛైర్మన్ ఎన్ రవి, జీ న్యూస్ ఎడిటర్ ఇన్ చీఫ్ సుధీర్ చౌదరి, ఇండియా టుడే గ్రూప్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్ దీప్ సర్దేశాయ్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ చీఫ్ ఎడిటర్ రాజ్ కమల్ ఝా పైనా నిఘా పెట్టినట్లు సమాచారం. ఇలా ప్రముఖులే కాదు... ఇండియాలోని అధికారులు, జడ్జిలు, సైంటిస్టులు, విద్యా వేత్తలు, జర్నలిస్టులు, నటులు, మీడియా ప్రతినిధులు, మత పెద్దలు, ఉద్యమ కారులపైనా నిఘా పెట్టినట్లు తెలిసింది. అలాగే... ఆర్థిక నేరాలు, అవినీతి, ఉగ్రవాదం, డ్రగ్స్, బంగారం, ఆయుధాల స్మగ్లింగ్‌కి పాల్పడేవారు వైల్డ్ లైఫ్ అంశాల్ని చూసే వారిపైనా నిఘా కొనసాగుతున్నట్లు తెలిసింది. ఈ సంస్థ చైనా నిఘా వర్గాలు, సైనిక, భద్రతా ఏజెన్సీలతో కలిసి పనిచేస్తోంది. రెండు నెలలుగా తాము పెద్ద డేటా టూల్స్ వాడి... ఈ పరిశోధన చేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. మత బోధకులు, క్రీడాకారులు, నటులు ఇంకా చాలా రంగాలకు సంబంధించిన వారిపై కూడా చైనా దొంగచూపు వున్నట్లు తెలుస్తోంది.

ఈ కంపెనీ ఇండియాతోపాటూ... అమెరికా, బ్రిటన్, జపాన్, ఆస్ట్రేలియా కెనడా, జర్మనీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ నుంచి కూడా డేటా సేకరిస్తున్నట్లు తెలిసింది. ఇలాంటి డేటాను ఈ కంపెనీ నుంచి చైనా పాలకులు ఎందుకు పొందుతున్నారన్నది తేలాల్సి ఉంది.

ఈ లిస్ట్ లో చైనాకు వంతపాడే సోకాల్డ్ మేధావులు, చైనా డబ్బులిచ్చి మేపుతున్న జర్నలిస్టులతో పాటుగా దేశ హితం కోసం పనిచేసే వివిధ విభాగాలకు సంబంధించి వ్యక్తులు కూడా వుండడంతో దీనితో చైనా పెద్ద గూఢచర్యానికి పాల్పడుతోందనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఈ సమాచారంతో భారత ఇంటెలిజెన్స్ విభాగాలు పూర్తి స్థాయిలో అప్రమత్తమయి తదనుగుణ చర్యలను వేగవంతం చేసినట్లు సమాచారం.

#China #Spying #IndianPoliticians