మరీ ఇంతకు దిగజారిన ఉద్ధవ్ - శివసేన

Sep 12, Sat 2020 09:10 PM Politics

-- మాజీ నేవీ అధికారిపై దాడి

శివసేన.. ఇప్పుడు సోనియా సేనగా మారిపోయిందా..? ఏమాత్రం పాలన అనుభవం లేని ఉద్దవ్ థాక్రే., మహారాష్ట్రను పూర్తిగా అంధకారంలో నెడుతున్నారా..? ఉద్దవ్ ను తొలుబొమ్మను చేసి.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆట ఆడుకుంటున్నారా..? దేశ రక్షణలో పాలుపంచుకుని.., భారత నావిక దళం నుంచి పదవీ విమరణ చేసిన ఓ మాజీ సైనికుడిపై, శివసేన కార్యకర్తలు దాడి చేయడాన్ని ఏమని అర్థం చేసుకోవాలి. తనకు వాట్సాప్ లో షేర్ చేసిన ఒక మెసేజ్ ను ఫార్వర్డ్ చేశాడంటూ, 62 ఏళ్ళ నేవీ సైనికుడిని చితకబాదడమే కాకుండా..., ఉల్టా అతనిపైనే కేసు పెట్టి అరెస్టు చేసేందుకు.., శివసేన ప్రభుత్వం యత్నించడంకంటే దారుణం ఏముటుంది..?

మదన్ శర్మ అనే వృద్దుడు.., నేవీ రిటైర్డ్ అధికారి..! సీఎం ఉద్దవ్ తీరును ప్రశ్నిస్తూ చేస్తూ గీసిన కార్డూన్ ను ఫార్వర్డ్ చేశారంటూ, ముంబైలో సెప్టెంబర్ 11 శుక్రవారం అతని నివాసానికి వెళ్లి శివసేన కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో మదన్ శర్మ కన్నుకు తీవ్రంగా గాయమైంది. ఆ వెంటనే ముంబై పోలీసులు.., ఎంటరై పోయి.., పారిపోయిన శివసేన కార్యకర్తలను అరెస్టు చేయకుండా.., మదన్ శర్మపైనే తమకు ఫిర్యాదు అందిందని, వెంటనే తమ వెంట పోలీసు స్టేషన్ కు రావాలంటూ ఒత్తిడి చేశారు. తీవ్ర గాయాలతో నడవలేని స్థితిలో ఉన్న ఆ వృద్ధుడిని అరెస్టు చేసేందుకు యత్నించారు. దీంతో భయపడిన అతని కుటుంబ సభ్యులు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే అతుల్ కు ఫోన్ చేయడంతో ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసింది. ఘటన స్థలానికి చేరుకున్న బీజేపీ ఎమ్మెల్యే అతుల్ గాయపడిన మదన్ శర్మను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మదన్ శర్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అటు ఈ విషయం మీడియాకు చేరడంతో.. మదన్ శర్మను అరెస్టు చేసేందుకు యత్నించిన పోలీసులు వెనుకడుగు వేశారు. దాడి చేసిన శివసేన కార్యకర్తలను నలుగురిని అరెస్టు చేసి.., వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించివేశారు. మహారాష్ట్రలో శివసేన పాలనలో సామాన్య ప్రజానీకానికి రక్షణ లేకుండా పోయిందని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మదన్ శర్మ డిమాండ్ చేశారు. తన జీవితం మొత్తం దేశం కోసమే సమర్పించానని.., శివసేన కార్యకర్తలను తనపైదాడి చేస్తారని అనుకోలేదని శర్మ ఆవేదన వ్యక్తం చేశారు.

అటు నెటిజన్లు సైతం శివసేన మీద తమకు భ్రమలు తొలగిపోయాయని.., ఆపార్టీ నేత ఉద్దవ్, సోనియా, పవార్ ల చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయాడని, తన పాలన వైఫల్యాలపై ప్రజలు విమర్శలు చేస్తుంటే తట్టుకోలేక దాడులకు తెగబడుతున్నారని ఆరోపిస్తున్నారు. ప్రతి చిన్న విషయానికి మీడియా ముందు వచ్చి తమ స్పందన తెలిపే శివసేన నేతలెక్కడ..? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

#ShivaSena #UddhavThackeray #AttackOnExNavyOfficer