NationalistHub - శ్రీరంగం ఆలయం – సంప్రదాయ ఔదార్యం
Download and install Nationalist Hub Mobile App for instant updates from us.
శ్రీరంగం ఆలయం – సంప్రదాయ ఔదార్యం imgShare via Whatsapp web

విష్ణుమూర్తి శేష శయనుడై భక్తుల మొరలను ఆలకిస్తూ శ్రీరంగనాయకితో కొలువుతీరిన క్షేత్రం... శ్రీరంగం. విశాల ప్రాంగణం... ఎత్తయిన గోపురాలు...దేవతామూర్తుల సముదాయం...దేవాలయంలోనే పట్టణం... ‘రంగ రంగ రంగపతి రంగనాథా నీ సింగారాలే తరచాయె శ్రీరంగనాథా’... అని అన్నమయ్య సంకీర్తన చేసింది ఈ క్షేత్రం గురించే... ఆశ్చర్యపరిచే నిజాలు చెపుతోంది ‘నేషనలిస్ట్ హబ్’....

ఆసక్తికర నిజాలేంటో మీరే చూడండి... శ్రీరంగనాథుడు, రంగనాయకి అమ్మవారితో కొలువై ఉన్న వైష్ణవ దివ్యక్షేత్రం... శ్రీరంగం. ఇది తమిళనాడులోని తిరుచినాపల్లి కి ఆనుకొని ఉభయ కావేరీ నదుల మధ్యన ఉన్న ఒక ద్వీపం.

ఢిల్లీ సుల్తాన్‌ అల్లా వుద్దీన్ ఖిల్జీ కాలంలో శ్రీరంగనాథుడి మూర్తి ఎత్తుకెళ్లారన్న చరిత్ర ఉంది. శ్రీరంగంపై దాడి చేసిన అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాపతి మాలిక్ ఖఫర్ రంగనాథుడి మూర్తి ఢిల్లీకి తరలించాడట. సుల్తాన్‌ కుమార్తె తుళుక్క నచియార్ స్వామి భక్తురాలిగా మారిందనీ ఆమే స్వయంగా విగ్రహాన్ని శ్రీరంగానికి చేర్చిందన్న కథనాలూ ఉన్నాయి. ఈ విగ్రహాన్ని రామానుచార్యులు శ్రీరంగానికి తీసుకువచ్చాడన్న వాదనలూ ఉన్నాయి.

సుల్తాన్‌ కుమార్తె తన విశేష భక్తితో స్వామివారిలో ఐక్యమైందని చెబుతారు. ఇందుకు ప్రతీకగా ఇప్పటికీ పౌర్ణమి, ఏకాదశి సమయాల్లో స్వామివారు లుంగీ ధరించి కనిపిస్తారు. రోటీలు, వెన్నను నైవేద్యంగా పెట్టడం ఆనవాయితీగా ఉంది. తుళుక్క నచియార్ (తురుష్క రాణి) కూతురా లేదా, ఘజ్నవీ రాజవంశానికి చెందిన మూడో రాజు మసూద్ కుమార్తెనా అన్న చారిత్రక వివాదాలూ ఉన్నాయి. షేక్‌ చినమౌలానా ఈ ఆలయానికి ఆస్థాన నాదస్వర విద్వాంసునిగా పనిచేశారు.

శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయం పల్లవ, చోళ సామ్రాజ్యాలకు చెందిన చారిత్రక గత వైభవాన్నీ, వేలాది సంవత్సరాలనాటి ఓ నాగరికతనూ చాటి చెబుతుంది. పల్లవరాజుల పాలన ధర్మపరమైన ఓ గట్టి పునాది ఏర్పరడానికి ప్రతీకగా నిలుస్తోంది. దక్షిణ భారతదేశంలో, ప్రత్యేకించి కర్ణాట ప్రాంతంలో హిందూ సాంస్కృతిక వృద్ధికి ఈ సామ్రాజ్యం గొప్ప ప్రోత్సాహం ఇచ్చినట్టు కనిపిస్తుంది. కోరమండల్ తీరాన్నీ, తూర్పు దక్కన్ ప్రాంతంలోని ప్రధాన భూభాగాన్నీ మూడు వందల ఏళ్ళకు పైగా పరిపాలించిన చోళ వంశం రాజులు ఆ ప్రాంతాల్లో ఓ పురోగామి హిందూ సంస్కృతి వర్థిల్లేందుకు దోహదపడ్డారు.

భారతదేశంపై దండెత్తిన ముస్లీం రాజులు హిందూ సాంస్కృతికి చిహ్నాలైన దేవాలయాలను, కట్టడాలను ధ్వంసం చేశారు. అందుకు దేవతామూర్తులను ఖండించి తునాతునకలు చేశారు. అయినా సరే ఇప్పటికీ ‘శ్రీరంగం’ ఆలయంలోలాగే సంప్రదాయాల విషయంలో వ్యతిరేకతతో నిమిత్తం లేకుండా ఆచారాలను కొనసాగించడమే హిందూ ధర్మ ఔదార్యం. ....