NationalistHub - అఫ్రిదీకి సరైన జవాబిచ్చిన శిఖర్‌ భారత క్రికెటర్లు
Download and install Nationalist Hub Mobile App for instant updates from us.
అఫ్రిదీకి సరైన జవాబిచ్చిన శిఖర్‌ భారత క్రికెటర్లు imgShare via Whatsapp web

తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం అంటే ఇదే…! పాకిస్తానీలకు… ఇది వెన్నతో పెట్టిన విద్యనా అంటే…, అందులో ఏమాత్రం డౌట్ లేదని కొంతమంది నెటిజన్లు వాపోతున్నారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది…, కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా…, పేద ప్రజలకు నిత్యావసరాలు అందించాలని అనుకున్నాడు. దీని కోసం ఫండ్ రైజ్ చేసేందుకు…, తమ వంతు సహాయం చేయాలని , మన భారత క్రికెటర్లనైనా యువరాజ్ సింగ్, హర్బజన్ సింగ్ లను కోరాడు.! వారు కూడా తలపెట్టిన కార్యం మంచిదే కదా అనే ఉద్దేశంతో, ఆఫ్రిదీ… స్టార్ట్ చేసిన ఫౌండేషన్ కు మద్దతుగా ప్రతి ఒక్కరు సహాయం చేయాలంటూ వీడియో సందేశాలు కూడా ఇచ్చారు..! అంతేకాదు ఆఫ్రీది… మన భారతీయ క్రికెటర్ల నుంచి కూడా సాయం అందుకున్నాడు.

ఆఫ్రీది మాత్రం…, మన భారతీయ క్రికెటర్ల నుంచి సాయం తీసుకుని…, మన భారత్ పై…కశ్మీర్, మరి ముఖ్యంగా ప్రధాని మోదీపై తన వక్రబుద్ధిని చూపించాడు…! పాకిస్తానీలకు ఎంత చేసిన బూడిదలో పోసిన పన్నీరేనని నిరూపించాడు..! ఇంకా చెప్పాలంటే… తినే కంచంలోనే ఉమ్మేసే రకమని…, తన ఈ చర్యలతో ఆఫ్రీది తనను తాను నిరూపించుకున్నాడని…నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.! గతంలో కశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన సమయంలోనూ అన్యాయమంటూ భారత ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టాడు.!

తాజాగా పాకిస్తాన్ లో లాక్ డౌన్ నేపథ్యంలో… ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు తన ఫౌండేషన్ ద్వారా సహాయం చేసేందుకు.., ఆఫ్రిదీ…., పాక్ ఆక్రమిత కశ్మీర్ లో పర్యటించాడు. కశ్మీర్ లో 7 లక్షల సైన్యాన్ని భారత్ మోహరించిందని…, ప్రతి రోజు సివిలియన్స్ ను టార్గెట్ చేస్తూ చంపేస్తోందని ఆఫ్రిది ఆరోపించాడు.! తమ దేశంపై భారత్ యుద్ధ విమానాలను పంపిస్తే…, తాము వాటిని కూల్చి…, ఉల్టా పట్టుబడిన భారత పైలట్ కు టీ తాగించి…, సగౌరవంగా తిరిగి భారత్ కు అప్పజెప్పామని…, తమది శాంతిని కోరుకునే దేశమని…, కశ్మీర్ ప్రజలందరూ కూడా తమతోనే ఉన్నారని.., కానీ భారత ప్రధాని నరేంద్ర మోదీ మనస్సులో…, కరోనా కంటే ప్రమాదకరమైన వ్యాధి ఉంది’ అని ఆఫ్రీది వివాదాదస్పద వ్యాఖ్యలు చేశారు.! పీవోకేలో… ఆఫ్రీది చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

దీంతో ఆఫ్రీది చేసిన వ్యాఖ్యలపై భారత క్రికెట్లర్లు అంతే దీటుగా తమదైన శైలీలో కౌంటర్లు ఇచ్చారు.! ఇండియన్ నేషనలిజం విషయంలో…, ఎప్పుడూ ముందు వరుసలో నిలిచే…, భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ట్వీటర్ వేదికగా అఫ్రిదిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘కశ్మీర్‌లో భారత ప్రభుత్వం ఏడు లక్షల సైన్యాన్ని మోహరించిందని ఓ 16 ఏళ్లు వృద్ధుడు విషం కక్కుతున్నాడు. భారత్‌ సొంతమైన కశ్మీర్‌ కోసం 70 ఏళ్లుగా భిక్షాటన చేస్తూనే ఉన్నారు. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌, ఆర్మీ చీఫ్‌ బజ్వా, అఫ్రిది లాంటి వ్యక్తులు కుట్ర పన్నుతున్నారు. ఏం చేసినా కశ్మీర్‌ ఎప్పటికీ భారతీయుల సొంతమే’ మీకు బంగ్లాదేశ్ గూర్తుంది కదా అంటూ.., ఆఫ్రిదికి…, గంభీర్ గట్టి కౌంటర్‌ ఇచ్చారు.

అటు….ఆఫ్రిదీకి సాయం చేసిన యువరాజ్ సింగ్, హర్బజన్ సింగ్ కూడా…అతని తీరుపై మండిపడ్డారు. పేద ప్రజల కోసమంటే తాము సాయం చేశామని…, మా దేశాన్ని…, మా ప్రియతమ ప్రధానిపై, కశ్మీర్ పై నోరు పారేసుకుంటే తాము చూస్తూ ఊరుకునేది లేదని యూవీ, భజ్జీలు ఆఫ్రీదికి స్పష్టం చేశారు. ఆఫ్రీది భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని…, ఆఫ్రీదిని తాము స్నేహితుడు అని పిలిచినందుకు…, ఎంతో బాధపడుతున్నామని…, నిజానికి ఆఫ్రిదీకి కనీసం స్నేహితుడని పిలిపించుకునే అర్హతనే లేదని అన్నారు.

ఇక…టీమిండియా గబ్బీర్ సింగ్…డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ అయితే… కశ్మీర్ మాది…మాతోనే ఉంటుంది..ఎప్పటికీ మాదే…, కావాలంటే నీ దేశంలోని 22 కోట్లమందిని తీసుకుని రా…, మాలో ఒక్కరు లక్షల మందితో సమానం…అంటూ ట్వీటర్ ద్వారా ఆఫ్రిదికి ఏకంగా హెచ్చరికనే పంపాడు శిఖర్ ధావన్.! కరోనా మహమ్మారితో ప్రపంచం పోరాడుతుంటే…పాకిస్తానీలు…కశ్మీర్ పై ఏడుస్తున్నారని ధావన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అటు నెటిజన్లు కూడా షాహిద్ అఫ్రిదీ ఓవర్ యాక్షన్ పై మండిపడుతున్నారు. మతం ఆధారంగా భారత్ నుంచి విడిపోయిన తర్వాత పాకిస్తాన్ ఒక విఫల దేశంగా మిగిలిపోయిందని…, ఇప్పటికైనా భారత్ పై ఏడుపులు మానేసి…తమ దేశం గురించి ఆలోచిస్తే మంచిందని ఆఫ్రిదికి సలహాలు ఇస్తున్నారు. ఇది చూసైనా మన తెలుగు ప్రజలు… పాకిస్తానీల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ....